అలియా వంట , పియానో, కథక్‌ ….

అలియాభట్‌ నటిగానే కాదు, సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె సంగీతం, డాన్సుల్లోనూ ప్రావీణ్యం సంపాదించుకునే పనిలో బిజీగా ఉంది. ఇటీవల ‘బద్రినాథ్‌ కి దుల్హానియా’ చిత్రం తర్వాత వచ్చిన గ్యాప్‌ని కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఉపయోగించు కుంటోంది. ఇందులో భాగంగా వంట నేర్చుకోవడం, పియానో వాయించడంతోపాటు కథక్‌ నృత్యాన్ని నేర్చుకుంటోంది. అందుకు ఓ ప్రొఫెషనల్‌ ట్యూటర్‌ని పెట్టుకొని సాధన చేస్తుందట. నెల రోజులుగా ఈ ట్రైనింగ్‌ నడుస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఆమె స్పందిస్తూ, ‘తదుపరి చిత్రాలు ప్రారంభమయ్యేలోపు వచ్చిన గ్యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వంటలతోపాటు పియానో వాయించడం, కథక్‌ నృత్యాన్ని నేర్చుకుంటున్నాను’ అని తెలిపింది.
అంతేకాదు నిర్మాతగా మారేందుకు కూడా అలియా ఉవ్విళ్లూరుతోంది. కేవలం నటిగానే పరిమితం కాకుండా తన ప్రతిభను నిర్మాతగా కూడా చూపించాలని భావిస్తోంది . ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ బాటలోనే పయనిస్తోంది. తనలో ఉన్న కొన్ని ఆలోచనలు సినిమాగా చెయ్యాలనుకున్నప్పుడు నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో తనే నిర్మాతగా మారాలనుకుంటుంది. ప్రస్తుతం ఆమె ‘డ్రాగన్‌’, ‘గల్లీబాయ్ ‘ చిత్రాల్లో నటిస్తుంది.