అల్లు స్నేహరెడ్డి ‘ఫైర్ ఫ్లై కార్నివాల్’కు అల్లు అర్జున్

ఘనంగా అల్లు స్నేహ రెడ్డి, పికాబు ప్రెసెంట్ ఫైర్ ఫ్లై కార్నివాల్ !
– అల్లు స్నేహ రెడ్డిని ప్రోత్సహిస్తూ సపోర్ట్ గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ని ఈ రోజు ఎన్  కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ కి ముఖ్య అతిధి గా వచ్చిన అల్లు అర్జున్ అల్లు స్నేహ రెడ్డి కి, నాగు రెడ్డి , స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ : పుష్ప షూట్ మధ్యలో  నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి మరియు స్మిత రెడ్డి కి అభినందనలు. ఈ కార్యక్రమం ని ఇంత సపోర్ట్ చేసిన మీడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.