‘ఆటా’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) కొత్త కార్యవర్గం !

‘అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (‘ఆటా’) అధ్యక్షునిగా భువనేశ్ బుజాల సోమవారం పదవీబాధ్యతలను స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి భువనేశ్ గత పదహారేళ్ళుగా ఆటాలో భాగస్వాములవుతూ వచ్చారు. ఆరేళ్ళ క్రితం 2014 లో జరిగిన  ఫిలడెల్ఫియా కన్వెన్షన్ లో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించిన భువనేష్ నాశ్విల్లే నగరంలో సోమవారం జరిగిన అటా కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ గా పదవీబాధ్యతలను స్వీకరించారు.

‘ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్’ గా జయంత్ చల్లా, కాశీ విశ్వనాధ్  కొత్తా, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్  నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హను తిరుమల రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి. రామ్ అన్నాది, రవీందర్ గూడూరు, రిండా సామ, శరత్ వేముల, సుధీర్ బండారు, విజయభాస్కర్  తుపల్లి ఎన్నికయ్యారు.

‘ఆటా’ ప్రెసిడెంట్ గా భువనేశ్ బుజాల, కార్యదర్శిగా హరిప్రసాద్ రెడ్డి లింగాల, కోశాధికారిగా సాయినాధ్ రెడ్డి బోయపల్లి, సహ కార్యదర్శిగా రామకృష్ణ రెడ్డి ఆలా, సహ కోశాధికారిగా విజయ్ కుందూరు ఎన్నికయ్యారు. పదవీబాధ్యతల స్వీకరణ సందర్భంగా… భువనేశ్ తన కార్యవర్గం ప్రాధాన్యతలు వివరించారు. ‘ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్’  అమెరికాలోని ప్రతీ రాష్ట్రానికీ విస్తరిస్తున్నామని వెల్లడించారు. తెలుగు వారు దురదృష్టవశాత్తూ ఏదైనా ఆపదలో చిక్కుకున్నపక్షంలో… ‘ఏటీఏ సేవ’ 1-844 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చెయ్యాలని సూచించారు. ‘ఏటీఏ ఫౌండేషన్’ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో  సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో తెలుగు సంస్కృతీసాంప్రదాయాలను పరిరక్షించే క్రమంలో ఆటా నిత్యం కృషి చేస్తుందని భువనేష్ పేర్కొన్నారు. మాతృభూమిలో సేవా కార్యక్రమాలను నిర్వహించాలనుకున్నపక్షంలో… ప్రవాసులుప్రవాసులు ఆటా ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 లో జులై 1-3 తేదీల్లో  నిర్వహించనున్న ఏటీఏ సభలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.