నేనెవరినీ పెళ్లి చేసుకోలేదు !

రేష్మిపై కొత్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తనకు అత్యంత వైజాగ్‌కు చెందిన, తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తిని రేష్మి పెళ్లాడినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ టాపిక్ ఇప్పుడు అందరినోటా సంచలనంగా మారింది. దీంతో షాక్ అయిన అమ్మడు.. పుకారుపై క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, తనపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది. ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనేదీ లేదని స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేష్మీ.. తన పనిలో తాను సంతోషంగా, బిజీగా ఉన్నానని, వేరే వాటి గురించి ఆలోచించే టైమ్ తనకు లేదని చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో తన స్వస్థలమైన వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమంది. ‘వైజాగ్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబ సభ్యులంతా అక్కడే ఉన్నారు. ఏదో ఒకరోజు నేను కూడా అక్కడే సెటిల్ అవుతాను. ఇది మాత్రం పక్కా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఆరు నెలలకోసారైనా తప్పకుండా వైజాగ్‌కు వెళ్తాను. వైజాగ్ చాలా అందమైన నగరం. అక్కడ ఏదో తెలియని అద్భుతమైన శక్తి ఉంది‌’ అని చెప్పింది.

టెలివిజన్‌లో యాంకర్‌గా చేస్తున్నారు. అది మీ కెరీర్‌పై ప్రభావం చూపదా..? అని ప్రశ్నించగా.. ఆ భావన తప్పు అని కొట్టిపారేసింది. టెలివిజన్‌లో నటిస్తే తప్పేముంది..? అని ప్రశ్నించింది. ‘నేనీస్థితిలో ఉన్నానంటే టెలివిజనే ప్రధాన కారణం. టెలివిజన్‌కు నేను రుణపడి ఉంటాను. అంతెందుకు ఎంత పెద్ద సినిమా విడుదల చేయాలన్నా ప్రమోషన్స్ కోసం టెలివిజన్‌ను సంప్రదించాల్సిందే. హాలీవుడ్ సూపర్‌స్టర్స్ కూడా వెబ్ సిరీస్, టెలివిజన్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. అలాంటి టెలివిజన్‌ను తక్కువ చేస్తూ మాట్లాడటం సరికాదు