నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ‘తలకోన’

నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో “తలకోన” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ నిర్మాత రామారావు  కెమెరా స్విచ్ ఆన్ చేయగా… ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు.

చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ… క్రైమ్ థ్రిల్లర్ తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. అయితే ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు.. అందులో ఇంకో కోణం కూడా ఉంటుంది .పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపించడం జరుగుతుంది. ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేసాము. తలకోన ఫారెస్ట్ లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు.. ఎంతమంది తిరిగొచ్చారు.. అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్  గా రూపొందిస్తున్నాము. అందుకు తగ్గ టీమ్ ను, టెక్నికల్ టీమ్ కూడా సినిమాకు తీసుకోవడం జరిగింది.. అని తెలిపారు.

నిర్మాతల్లో ఒకరైన డి.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ… మొదటిసారి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాను.. మంచి స్టోరీ. తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా అన్నారు.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ… మంచి స్క్రిప్ట్స్ కు నేను ఫ్యాన్ ను. అదే ఇప్పుడు ఈ తలకోన చిత్రం చేయడానికి కారణం అయ్యింది. నేను మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటాను. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా మంచి విజయంతో పాటు మంచి పేరును కూడా ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు.
ఈ కార్యక్రమంలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా, ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ పాల్గొన్నారు.

ఈ చిత్రానికి  డిఓపి: మల్లికార్జున్, మ్యూజిక్: సుభాష్ ఆనంద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నగేష్ నారదాసి
నిర్మాతలు: విశ్వేశ్వర శర్మ, దేవర శ్రీధర్ రెడ్డి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: బాసింశెట్టి వీరబాబు, జాన్ శామ్యూల్,
నిర్వహణ: పరిటాల వీర గౌతమ్ రాంబాబు