డిఫ‌రెంట్ కాన్సెప్ట్.. ప్యూర్ ల‌వ్ స్టోరితో ‘పాప్ కార్న్’

ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా… అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా నిర్మిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’.  ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. ఫిబ్రవరి 10న సినిమా విడుదల. ఈ మూవీ ట్రైల‌ర్ విడుదల కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా కింగ్ అక్కినేని నాగార్జున విచ్చేసిట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.
నాగార్జున మాట్లాడుతూ… ‘‘‘పాప్‌కార్న్’ మూవీ నిర్మాత‌లు చ‌ల‌ప‌తిరాజు, భోగేంద్ర గుప్తాగారికి అభినంద‌న‌లు.  లిఫ్ట్ లో సాంగ్ కొరియోగ్ర‌ఫీ చేసిన అజ‌య్‌కి అభినంద‌న‌లు. సినిమాను చక్కగా చేశాడు. నాకు బాగా న‌చ్చింది. ఆదిత్య మ్యూజిక్‌కి అభినంద‌న‌లు. డైరెక్ట‌ర్ ముర‌ళి టెన్ష‌న్ ప‌డ‌న‌క్క‌ర్లేదు. సినిమా డిఫ‌రెంట్‌గా ఉంది. అలాగే హీరో సాయిరోన‌క్‌కి ఆల్ ది బెస్ట్‌. అవికాగోర్  చిన్నారి పెళ్లి కూతురు  సీరియ‌ల్‌ను 128 దేశాల్లో  డ‌బ్ చేశార‌ని తెలిసింది. అవికా గోర్  పాన్ ఇండియా కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌. క‌జికిస్థాన్‌లోనూ రెండు సినిమాలు చేసింది. మేం మా టీవీలో పార్ట్‌న‌ర్స్‌గా ఉన్న‌ప్పుడు అందులో ప్ర‌సార‌మైన చిన్నారి పెళ్లికూతురు సీరియల్ టాప్‌గా నిలిచింది. అప్పుడు నాకు అవికా గోర్ ప‌రిచ‌యం. దాని త‌ర్వాత ఉయ్యాలా జంపాలా సినిమాను రామ్మోహ‌న్‌గారితో క‌లిసి నిర్మించాం. ఇప్పుడు లిఫ్ట్‌లో పాట‌, అవికా ఎక్స్‌ప్రెష‌న్స్‌, ఎన‌ర్జీ మామూలుగా లేదు. అవికా గోర్ హీరోయిన్‌గానే కాదు, నిర్మాత కూడా అయ్యింది. డిఫ‌రెంట్ సినిమాలను ఆడియెన్స్ బాగా ఆద‌రిస్తున్నారు. అలాగే ఈ పాప్ కార్న్ సినిమాను పెద్ద హిట్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది ’’ అన్నారు.
చిత్ర స‌మ‌ర్ప‌కుడు ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు మాట్లాడుతూ… ‘‘ఈ సినిమాకు డైరెక్ట‌ర్ ఎంత ముఖ్య‌మో.. అవికాగోర్‌ కూడా అంతే ముఖ్యం. ఈ సినిమాను ఆమె ముందుండి న‌డిపించింది. అలాగే సాయి రోన‌క్‌గారికి థాంక్స్‌. సినిమాను క‌ష్ట‌ప‌డే కాదు. ఇష్ట‌ప‌డి చేశాం. ‘పొలిమేర’ సినిమా ఎలా ఉంటుందో దాన్ని మించి రెండు వంద‌ల శాతం సినిమా బావుంటుంది. సినిమా చివ‌రి 45 నిమిషాలైతే అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది. పెద్ద‌వాళ్లంద‌రూ మ‌ళ్లీ వెన‌క్కి వెళ‌తారు. చిన్న‌వాళ్లైతే ఎంజాయ్ చేస్తారు. ప్యూర్ ల‌వ్ స్టోరి. అందుకే వాలెంటైన్స్ డే కంటే ముందే రిలీజ్ చేస్తున్నాం. అంద‌రూ సినిమాను థియేట‌ర్స్‌లోనూ చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ… ‘‘నాగార్జునగారు మా ‘పాప్ కార్న్’ సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేయ‌టం నిజంగానే కిక్ ఇచ్చింది. ఫిబ్ర‌వ‌రి 10న సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. అంద‌రూ స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.
చిత్ర ద‌ర్శ‌క‌డు ముర‌ళి గంధం మాట్లాడుతూ…  ‘‘డైరెక్టర్‌గా ఇది నా తొలి చిత్రం.  ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి టీమ్‌ను స‌పోర్ట్ చేసిన నాగార్జున‌గారికి మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాలు. అలాగే అవికా గోర్‌, సాయి రోన‌క్‌.. గారికి, నిర్మాతలకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ థాంక్స్‌’’ అన్నారు.
నిర్మాత, హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ…  ‘‘తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ అన్నపూర్ణ స్టూడియోస్‌తోనే ప్రారంభ‌మైంది. ఆ సినిమాలో నాగార్జున‌గారితో ప‌రిచయం ఏర్ప‌డింది. నాకు, రాజ్ త‌రుణ్‌కి తొలి సినిమా. అయితే మా కాన్ఫిడెన్స్ ఎక్క‌డా దెబ్బ తిన‌కూడ‌ద‌ని ఆయ‌న ఎప్పుడూ మా వెంటే ఉండేవారు. మంచి నిర్మాతే కాదు.. మంచి మ‌నిషి కూడా. మా సినిమా ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌చ్చినందుకు ఆయ‌నకు మ‌న‌స్ఫూర్తిగా థాంక్స్. పాప్‌కార్న్ సినిమా విష‌యానికి వ‌స్తే నేను చాలా గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ సినిమాకు నిర్మాత‌గా చేయ‌టం రిస్క్ అని అన్నారు. కానీ నేను ఆ రిస్క్ తీసుకోవ‌టం ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఈ రిస్క్ తీసుకోవ‌టానికి స‌పోర్ట్ చేసిన నా త‌ల్లిదండ్రుల‌కు థాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కులు నేను చేసిన ప్ర‌తి సినిమాకు అప‌రిమిత‌మైన ప్రేమాభిమానాల‌ను అందించారు. వారిచ్చిన ఆశీర్వాదాల‌తోనే నాకు ఏదైనా కొత్త‌గా చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అలాగే ఈ సినిమా నిర్మాత‌లు చ‌ల‌ప‌తి రాజుగారు, భోగేంద్ర గుప్తాగారు నాపై న‌మ్మ‌కం ఉంచారు వారికి థాంక్స్‌. మా కాన్సెప్ట్‌, డైరెక్ట‌ర్‌ను న‌మ్మారు. ఈ సినిమా కాన్సెప్ట్ డిఫ‌రెంట్, టెక్నిక‌ల్‌గా ఛాలెంజింగ్ మూవీ. లిఫ్ట్‌లోనే యాక్టింగ్‌, పాట‌లు అన్నీ చేయాలి. ఇంత‌కు ముందు నేను చేసిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్న‌మైంది’’ అన్నారు.
హీరో సాయి రోనక్ మాట్లాడుతూ…  ‘‘ సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల లోపే ఆడియెన్స్ పాప్ కార్న్ ప్ర‌పంచంలోకి వ‌చ్చేస్తారు. లిఫ్ట్‌లో న‌డిచే క‌థ క‌దా.. బోర్ అయిపోతామేమో అని అనుకున్నాను. కానీ ముర‌ళిగారు క‌థ‌ను నెరేట్ చేయ‌టం స్టార్ట్ చేయ‌గానే ఎక్క‌డా బోర్ ఫీల్ కాలేదు. ఈ సినిమా క్లైమాక్స్‌న‌యితే ప్రేక్ష‌కులు సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూస్తారు. అవికా గోర్ టైమింగ్ మామూలుగా ఉండ‌దు. న‌ట‌న‌లోనే కాదు.. సెట్స్‌కు రావ‌టంలోనూ అంతే. త‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌టం అనేది బ్రిలియంట్ ఎక్స్‌పీరియెన్స్‌. ఆదిత్య మ్యూజిక్‌కు థాంక్స్‌. నా సినిమాకు వారు ప్ర‌తిసారి స‌పోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బెజవాడ ప్రసన్నకుమార్, కొరియోగ్రాఫర్ అజయ్, ఆదిత్య మ్యూజిక్ మ‌యాంక్‌, నిరంజ‌న్‌ తదితరులు పాల్గొన్నారు.  ‘పాప్ కార్న్’ మూవీ పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.  ఈ చిత్రానికి  సమర్పణ: ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, బ్యాన‌ర్స్‌: ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ ,నిర్మాత‌: భోగేంద్ర గుప్తా, కాన్సెప్ట్ – స్టోరి – డైలాగ్స్ – స్క్రీన్ ప్లే – ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళి గంధం, కో ప్రొడ్యూస‌ర్స్‌: అవికా గోర్‌, ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు, శేషు బాబు పెద్దింటి, సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎన్‌.బాల్ రెడ్డి, మ్యూజిక్: శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌