‘బట్టల రామస్వామి బయోపిక్కు’ షూటింగ్ పూర్తి !

సతీష్ కుమార్ నిర్మాణం లో రామ్ నారాయన్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్కు”.సెవెన్ హిల్ల్స్ పతాకం పై నేహా శ్రీ అండ్ సుదీక్ష సమర్పణలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ… “మామూలుగా పెద్ద వాళ్ళ బయోపిక్ లనే సినిమాలుగా చేస్తారు.కానీ మేము ఒక కామన్ మ్యాన్ కథనే బయోపిక్కు గా రూపొందించాము. నిర్మాత సతీష్ గారు ఎక్కడ వెనకంజ వేయకుండా అన్నీ పనుల్లో చాలా సపోర్ట్ చేశారు. ఇక టీమ్ అంతా నాకు గోల్డ్ గిఫ్ట్ లా దొరికారు. మా సినిమా టైటిల్ లో యాక్ట్ చేసిన అతన్ని మేము ఇప్పుడే రివీల్ చేయడం లేదు. కానీ, అతను మాత్రం ఇండస్ట్రీ కి మరో రాజేంద్రప్రసాద్ అవుతారు అని మాత్రం చెప్పగలను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించిన చిత్రం కనుక అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా అన్నారు.
నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ…నవంబర్ లో మొదలు పెట్టి డిసెంబర్ 18న గుమ్మడికాయ కొట్టాము. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశాము. కథను నమ్మి కథే హీరో అనుకొని చేసిన చిత్రం ఇది. కామెడీతో సినిమా చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. త్వరలో అది కూడా పూర్తిచేసి ఏప్రిల్ నెలాఖరులో కానీ మే నెలలో కానీ సినిమాను విడుదల.. అన్నారు.
 
నటుడు భద్రం మాట్లాడుతూ…ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ బయోపిక్కు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగే కధాంశం.పెళ్లైన కొత్తలో జంటకు ప్రతి రోజూ పండగలానే ఉంటుంది.. ఆ తరువాత కొన్నాళ్ళకు ‘ముందుంది ముసళ్ళ పండగ’ లా అనిపిస్తుంది. అదే ఈ సినిమాలో చూపించడం జరిగింది. నా పాత్ర ఎప్పటిలానే ఆకట్టుకుంటుంది. సప్రైజ్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు.
 
ఈ కార్యక్రమంలో శాంతి రావు,సాత్త్వి,కెమెరామెన్ కర్ణ తదితరులు పాల్గొన్నారు.ఈ చిత్రానికి డి.ఓ.పి కర్ణ పైరసాని,ఎడిటర్:సాగర్ దాడి,మాటలు,పాటలు:వాసుదేవమూర్తి, కథ స్క్రీన్ ప్లే,సంగీతం,డైరెక్షన్ :రామ్ నారాయణ్.