ఈ వ‌య‌స్సులోనూ వ‌రుస ఆఫ‌ర్లు !

శ్రేయ‌ నటిగా స‌క్సెస్ అందుకుంది .  దాదాపు 18 సంవ‌త్స‌రాల సినీ కెరియ‌ర్ లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు వ‌యస్సు ముప్పైఐదేళ్ళు  కాగా, ఇక ఆఫ‌ర్లు రావ‌డమే క‌ష్ట‌మ‌ని అంద‌రు అనుకున్నారు. కాని అంద‌రి అంచ‌నాలు మించేలా హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌కమైన రోల్స్ చేస్తూ పోతోంది. ఇటీవ‌ల బాలకృష్ణ వందో చిత్రం “గౌతమిపుత్ర శాతకర్ణి”లో  రాణి వశిష్టీ దేవిగా మెప్పించిన‌ శ్రియా శరణ్, ప్రస్తుతం పూరీ జగన్నాధ్- నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతోన్న “పైసా వసూల్” చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక కృష్ణవంశీ తెర‌కెక్కిస్తున్న‌ “నక్షత్రం” మూవీలోను శ్రేయ ఐటెం సాంగ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇక అర‌వింద్ స్వామి, సందీప్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న న‌ర‌కాసురుడు అనే చిత్రంలో శ్రేయ అర‌వింద్ తో జోడి క‌ట్ట‌నుంది. “న‌ర‌కాసురుడు” చిత్రం త‌మిళంలో  రూపొందుతుండ‌గా యంగ్ డైరెక్టర్ కార్తీక్ నరేన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే శ్రేయ తాజాగా జరిగిన సైమా వేడుక‌లో తన అందంతో అందరి మతులు పోగొట్టేసింది. స్లీవ్ లెస్ డ్రెస్.. ట్రాన్స్ పరెంట్ వేర్ ధ‌రించి వీక్ష‌కుల‌కి అందాల విందు అందించింది. నేటి త‌రం భామ‌ల‌కు గ‌ట్టి పోటి ఇస్తున్న శ్రేయ రానున్న రోజుల‌లో మ‌రిన్ని అవకాశాలు అందుకుంటుంద‌ని చెప్పుకుంటున్నారు.