విజయశాంతి చేతులమీదుగా ‘డెడ్ లైన్’ టీజర్ విడుదల!  

బొమ్మారెడ్డి వి ఆర్ ఆర్ దర్శకుడిగా నిర్మించిన చిత్రం “డెడ్ లైన్”.                                              శ్రీవిఘ్నతేజ ఫిలిమ్స్ పతాకంపై తాండ్ర గోపాల్  నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్న సందర్భంంగా టీజర్ ని లేడీ సూపర్ స్టార్.. విజయశాంతి  చేతులమీదుగా విడుదల చేసారు.

విజయశాంతి మాట్లాడుతూ.. “దర్శకుడు రమణారెడ్డి నటుడిగా ఉన్నప్పటినుంచి తెలుసు..కొన్ని చిత్రాలలో కలిసి నటించాం.ఇప్పుడు తన దర్శకత్వంలో వస్తున్న డెడ్ లైన్ చిత్రం యొక్క టీజర్ ని  విడుదలచేయడం సంతోషంగా ఉంది..ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కుంటున్న లైంగిక అకృత్యాల నేపద్యంలో చక్కటి సందేశాన్ని ఇస్తూ..మోడరన్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ భరితంగా ఉండేలా..అందరినీ ఆకట్టుకునేలా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన…ఈ చిత్రం ఘన విజయం సాధించాలని  కోరుకుంటూ..చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

దర్శకుడు బొమ్మారెడ్డి మాట్లాడుతూ… “లేడీ అమితాబ్  విజయశాంతి గారి చేతులమీదుగా డెడ్ లైన చిత్రం టీజర్ విడుదలకావడం మా అదృష్టం. ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుంది.పాన్ ఇండియా విలన్ అజయ్ ఘోష్ పాత్ర వినూత్నంగా తీర్చిదిద్దడం జరిగింది. అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది. డూప్ లేకుండా ఫైట్స్ చేసి అబ్బుర పరచింది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం తో రూపొందింది అని చెప్పారు.

నిర్మాత తాండ్ర గోపాల్ మాట్లాడుతూ..  చిత్రం అద్భుతంగా వచ్చిందని చెబుతూ…టీజర్ ని విడుదల చేసిన విజయశాంతి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత సంజీవి గారు పాల్గొని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసారు.
అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్, సోనియా, కౌషిక్, ఐశ్వర్య, గోపికర్,శ్రీనివాసరెడ్డి నటించిన ఈ చిత్రానికి                                                                                                                                  సంగీతం..సబు వర్గీస్, డి.ఓ.పి..మురళి వై క్రిష్ణ, ఎడిటింగ్..మేనగ శ్రీను, లిరిక్స్..సుద్దాల అశోక్ తేజ, విజయేంద్ర చేలో