నచ్చితే చూడండి …లేదంటే పట్టించుకోకండి !

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ గ్లామర్ షో శృతి మించిపోతుంది. యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నా, కొందరికి మాత్రం ఒళ్ళు మండిపోతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీపిక పదుకునే మాగ్జిన్ కి ఇచ్చిన హాట్ ఫోటో షూట్ పై ఫైర్ అయ్యారు కొంద‌రు నెటిజ‌న్స్ . దీనికి దీపిక వెంటనే కౌంటర్ ఇచ్చింది. మొన్నటి వరకు ప్రియాంక చోప్రాపై విమర్శలు చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు. అయిన మేం ఎప్పుడు ఎలా కనిపించాలన్నది మా పర్సనల్ మేటర్. ఇందులో ఇతరుల జోక్యం అవసరం లేదు. మా లుక్ నచ్చితే ఎంజాయ్ చేయండి, లేదంటే పట్టించుకోకండి. అంతేగాని ఇలాంటి విమర్శలు చేయకండి అని ఘాటుగా బదులిచ్చింది. అసలు డ్రెస్ కి సరిపోయేలా బాడీని మలుచుకోవడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? అని ప్రశ్నించింది దీపిక. ఈ అమ్మడు ఇటీవల ‘ట్రిపుల్ ఎక్స్’ అనే హాలీవుడ్ సినిమాతో అలరించగా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘పద్మావతి’ అనే చిత్రం చేస్తుంది.

బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకొనే ప్రస్తుతం సంజయ్‌లీలా బన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పద్మావతి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు పద్మావతి షూటింగ్, మరోవైపు 70వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌తో బిజీగా గడిపిన దీపికా ఇపుడు బ్రేక్ తీసుకుంది. దీపికా కాస్త రిలాక్స్ అయ్యేందుకు ముంబై సిటీ నుంచి దూరంగా చెక్కేసింది.