‘ఇక్షు’ ట్రైలర్ లాంచ్ చేసిన దిల్ రాజు !

ఋషిక దర్సకత్వంలో హనుమంతురావు నాయుడు నిర్మిస్తున్న చిత్రం “ఇక్షు”.డాక్టర్ గౌతమ్ నాయుడు సమర్పణలో పద్మజా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిదా, కెప్టెన్ చౌదరి నటీనటులుగా  నిర్మిస్తున్న చిత్రం “ఇక్షు” సెప్టెంబర్ 16 న  ఐదు భాషల్లో విడుదలకు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్  ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు, నిర్మాతలు దిల్ రాజు, బేక్కం వేణుగోపాల్, దామోదర్ ముఖ్య అతిధులుగా వచ్చారు. నిర్మాత దిల్ రాజు చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేశారు.
చిత్ర దర్శకురాలు వివి ఋషిక మాట్లాడుతూ.. నాకు ఇండస్ట్రీ కొత్త అయినా సురేష్ కొండేటి గారు ఫుల్ సపోర్ట్ చేశారు. సిద్ధం మనోహర్ ఇచ్చిన కథ  నచ్చిడంతో ఈ కథకు దర్శకత్వం  వహిస్తున్నాను .ఈ చిత్రానికి రామ్ అగ్నివేష్, రేఖ నిరోషా లను హీరో హీరోయిన్స్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్షు మూవీ అనేది నా కల . ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చాలా కష్టపడి తీశాము. నిర్మాత హనుమంతు రావు నాయుడు గారు ఈ సినిమాకు ఎం కావాలో అన్ని సమాకూర్చాడు. ఈ సినిమాను ఐదు దేశాలలో విడుదల చేస్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర నిర్మాత హన్మంత్ రావు నాయుడు  మాట్లాడుతూ.. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దిల్ రాజు గారికి , బసిరెడ్డి గారికి, బేక్కం వేణుగోపాల్ గారికి దామోదర్ గారికి అందరికీ నా ధన్యవాదములు.ఈ చిత్రానికి పనిచేసిన నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా తొందరగా పూర్తి అయ్యింది. ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ.. మా నిర్మాత వివి ఋషిక నాకు ఇంతకుముందు కలసి సినిమా అంటే చాలా ఇష్టం మంచి  సినిమా తియ్యాలని ఉంది చెప్పడం జరిగింది. ఆ తరువాత తను కథ రెడీ చేసుకొని నన్ను పిలిచి ఈ కథ వినిపించడం జరిగింది. ఆ  కథ వినగానే  వీరు మంచి విజన్ ఉన్న దర్శకురాలు అనుకున్నాను. నెల్లూరు లో జరిగిన ఇన్సిడెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తర్వాత వివి ఋషిక మేడం పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామ్ పెద్ద హీరో అవ్వాలి. నిర్మాత హనుమంతరావు సినిమా విషయంలో కాంప్రమైజ్  కాకుండా నిర్మించారు.ఈ సినిమా గొప్ప విజయం సాదిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు
హీరో రామ్ అగ్నివేష్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ ని..అయన సినిమాలు చూసి పెరిగాను. నేను చాలా సినిమాలు చూశాను. నాకు దర్శకురాలు చెప్పిన కథ అద్భుతం అనిపించింది. దాంతో క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ తో నా క్యారెక్టర్ ను నా శక్తి మేర యాక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని అన్నారు.
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఋషిక, మాటలు: మున్నా ప్రవీణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ గుత్తుల,
మూల కథ: సిద్ధం మనోహర్, కెమెరా: నవీన్ తొడిగి, పాటలు:-కాసర్ల శ్యామ్
మ్యూజిక్: వికాస్ బాడిస, ఎడిటింగ్: ఎస్ బీ ఉద్ధవ్