ఈమె మళ్ళీ కాలేజీకి వెళ్తుందట !

నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం’ చేసిన పూజ హెగ్డే బొల్లి వుడ్ లో హృతిక్ తో ‘మొహంజదారో’ చేసింది .    గ్లామర్ తళుకులతో బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది పూజా హెగ్డే. తాజాగా ‘డీజే దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో అల్లు అర్జున్‌తో జోడీ కట్టింది.

పూజ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు చదువుపై దృష్టిసారిస్తున్నది . త్వరలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆమె విదేశాలకు పయనమవుతున్నట్లు తెలిసింది. ‘డీజే దువ్వాడ జగన్నాథం’ తరువాత సినిమాలకు స్వల్ప విరామం ప్రకటించి చదువుపై దృష్టి సారించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆంథ్రోపాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ చేయనున్నట్లు సమాచారం. త్వరలో పూజా హెగ్డే కొన్నాళ్ళ పాటు  బుక్స్‌తో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆమెను మహేష్ బాబు కొత్త చిత్రం లో తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి