‘ఈగ ‘ సుదీప్ హాలీవుడ్ ఎంట్రీ !

0
12

నటులకు భాష అడ్డుకాదని ‘కిచ్చ’ సుదీప్ నిరూపించాడు. కన్నడ ఇండస్ట్రీలో సుదీప్‌కు మంచి పేరుంది. తన విలక్షణ నటనతో ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలడు ఈ కథానాయకుడు. కన్నడ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ క్రేజీ నటునికి తెలుగులో కూడా అభిమానులున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమాలో విలన్‌గా సుదీప్ అద్భుతంగా నటించాడు. ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈగ సినిమాలో ఉత్తమ నటనకుగాను సుదీప్ ఏకంగా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇక “బాహుబలి” చిత్రంలో కూడా సుదీప్‌కు చిన్న పాత్రను ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమాలో కూడా తన నటనతో ఆయన ప్రేక్షకులను మైమరపించాడు. అయితే సుదీప్ త్వరలోనే బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటబోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ నటిస్తున్న ‘టైగర్ జిందా హై’ సినిమాలో సుదీప్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంతో సుదీప్ బాలీవుడ్‌లో కూడా పాగా వేస్తాడని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అంతేకాదు… సుదీప్ త్వరలో ‘ది రిజైన్’ అనే ఓ హాలీవుడ్ సినిమాలో మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడే వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సుదీప్ ఆస్ట్రేలియా వెళ్లబోతున్నాడని సమాచారం. కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సత్తా చాటిన సుదీప్ హాలీవుడ్‌లోనూ రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here