వ‌ర్మ విడుదల చేసిన ‘గీత సాక్షిగా’ వీడియో సాంగ్

యువ‌కుల మ‌న‌సుని గిలిగింత‌లు పెట్ట‌డానికి మ‌న ముందుకు వ‌చ్చేసింది… ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ కుర్రకారు మనసుని కవ్వించేస్తుంది. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోనో తెలుసా.. ‘గీత సాక్షిగా..’.

PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో చేతన్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదర్శ్, చిత్ర శుక్లా, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ నటీ నటులుగా..  ఆంథోని మట్టిపల్లి దర్శకత్వంలో చేతన్ రాజ్ నిర్మిస్తోన్న సినిమా ‘గీతా సాక్షిగా’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అనే సాంగ్‌ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ..  ‘‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’  సాంగ్ చాలా క్యాచీగా ఉంది. పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ చాలా చాలా బావున్నాయి. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. అంద‌రికీ న‌చ్చేలా సాంగ్ ఉంటుంద‌ని కచ్చితంగా చెప్ప‌గ‌ల‌ను’’ అన్నారు.

శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ..  ‘‘‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’  సాంగ్‌ను వ‌ర్మ‌గారు రిలీజ్‌ చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. ఆయ‌న‌కు పాట చాలా బాగా న‌చ్చింది. ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.
గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలోని పాటను రెహమాన్ రాయగా.. సాహితీ చాగంటి హస్కీ వాయిస్‌లో పాడిన తీరు శ్రోతలను ఆకట్టుకుంటుంది . ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌, మోషన్ పోస్టర్స్, టీజర్‌లతో ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. వెంకట్ హ‌నుమ నరిసేటి సినిమాటోగ్ర‌ఫీగా ,కిషోర్ మ‌ద్దాలి ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.