ఈసారి అతని ప్రేమలో హన్సిక ?

కోలీవుడ్‌ బ్యూటీ హన్సిక మరోసారి ప్రేమలో పడిందట. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఈ హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హీరో అధర్వతో హన్సిక ప్రేమయాణం జోరుగా సాగుతోందట. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు, ఛాటింగ్‌లు హుషారుగా కొనసాగుతున్నాయట. ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కలిసి సినిమా చేయకపోయినా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పటినుంచి ఇద్దరూ తరచుగా కలుస్తూ పార్టీలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రారంభం కావడం విశేషం.

ఇక హీరో శింబుతో హన్సిక ప్రేమ వ్యవహారం తెలిసిందే. అప్పట్లో ‘తామిద్దరం ప్రేమించుకుంటున్నామంటూ’ హన్సిక స్వయంగా ప్రకటించింది. ‘అది నిజమేనంటూ’ తర్వాత శింబు కూడా అంగీకరించాడు. అయితే వాళ్ల ప్రేమ వ్యవహారం మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న హన్సిక ఇప్పుడు అధర్వకు దగ్గరైంది. మరి వీళ్ల ప్రేమ ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.