నా సినిమా కమర్షియల్‌ గాను.. మెసేజ్‌తోను ఉంటుంది !

క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘డ్రిల్‌’… దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్‌ పొలిచెర్ల డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌పై చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ‘డ్రిల్‌’. కారుణ్య చౌదరి హీరోయిన్‌ గా ,భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జెమినీ సురేష్‌, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబ్బర్దస్థ్‌ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్‌ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగాహరనాధ్‌ పొలిచెర్ల చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…
చిన్నప్పటి నుండి నాకు  సినిమాలంటే ఇష్టం. 8వ తరగతి నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ తర్వాత పలు పరిషత్‌ ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఆమెరికాలో డాక్టర్‌గా బిజీబిజీగా గడుపుతున్నప్పుడు ఒకరోజు అసలు మన లక్ష్యం ఏమిటి? మనం వెళుతున్న రూట్‌ ఏమిటి? అని ఆలోచించాను. మళ్లీ నటన వైపు మళ్లాను. తెలుగులో కెప్టెన్‌ రాణా ప్రతాప్‌, టిక్‌ టిక్‌, చంద్రహాస్‌, తదితర ఎనిమిది సినిమాలు తీశాను. కన్నడంలో కూడా కొన్ని సినిమాల్లో చేశాను.‘హోప్‌’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అమెరికాలో డాక్టర్‌ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నా.. ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్‌ తెలుసుకొంటాను. ఈ సినిమా విషయానికి వస్తే ఇదొక క్రైమ్‌బేస్డ్‌ మూవీ. ఇందులో లవ్‌ జిహాదీ అనేది కొంత భాగం మాత్రమే. నేను పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేశాను. నా వృత్తిలో భాగంగా చేధించే కేసుల్లో ఈ లవ్‌ జిహాదీ అనేది ఒక కేసు. నా ప్రతి సినిమాలోనూ కమర్షియల్‌ కంటెంట్‌తో పాటు మెసేజ్‌ ఉండేలా చూసుకుంటాను. అయితే గొప్ప గొప్ప మెసేజ్‌లు చెప్పే స్థాయి కాదు నాది. కానీ సమాజం పట్ల కళాకారుడిగా నాకు బాధ్యత ఉంటుంది. దాన్ని మాత్రం ప్రతి క్షణం గుర్తు  పెట్టుకుంటాను. ఈసినిమా కోసం చాలా కష్టపడ్డాం. సినిమా ఫస్ట్‌ కాపీ చూసుకున్న తర్వాత ఆ కష్టాలు అన్నీ మర్చిపోయాను. ‘డ్రిల్‌’ అనేది ఒక ఆయుధం. హత్యలు చేసే మనస్తత్వం ఉన్న వారు ఒక్కోసారి స్పెసిఫిక్‌గా కొన్ని ఆయుధాలను వాడతారు. అలాగే ఈ సినిమాలో హంతకుడు డ్రిల్లింగ్‌ మిషన్‌ను వాడి అందరినీ చంపుతుంటాడు. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచటం కోసం ‘డ్రిల్‌’ అని పెట్టాము.
‘డ్రిల్‌’ అందరికీ నచ్చే సినిమా అవుతుంది. ఇలాంటి క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలకు మ్యూజిక్‌, కెమెరా చాలా కీలకం. మా సంగీత దర్శకుడు డిఎస్‌ఎస్‌కె అటు సాంగ్స్‌ పరంగా, ఇటు సిట్యుయేషన్‌ పరంగా, బ్యాక్‌గ్రౌండ్‌ పరంగా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సంగీతం సినిమాలోని కొన్ని సీన్లను బాగా ఎలివేట్‌ చేశాయి. అలాగే కెమెరామెన్‌ వంశీకృష్ణ ప్రతి ఫ్రేమ్‌ను ఆకట్టుకునేలా చిత్రీకరించారు. ఆయన మా సినిమాకు ఒక పెద్ద ఎస్సెట్‌ అని చెప్పాలి. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈనెల 16న వరల్డ్‌వైడ్‌గా భారీగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రేక్షకులు మమ్మల్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది అన్నారు.
నటీ నటులు: హరనాథ్‌ పొలిచెర్ల, కారుణ్య చౌదరి, భవ్య, నిషిగంధ , తనికెళ్ళ భరణి ,రఘుబాబు , జెమినీ సురేష్‌, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ ,జబ్బర్దస్థ్‌ ఫణి తదితరులు .
సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రాఫర్‌ -వంశీ కృష్ణ, మ్యూజిక్‌ -ణూఖ, ఆర్ట్‌ -గోవింద్‌, ఎడిటర్‌-రామ్‌, మేకప్‌-వెంకటేశ్వరరావు, కాస్ట్యూమ్స్‌-రమేష్‌ రాయ్‌, స్టిల్స్‌ -రవి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌-ఎం.డి. ఖాన్‌, గ్రాఫిక్స్‌-వెంకట్‌, లిరిక్స్‌-జొన్నవిత్తుల, హరనాథ్‌ పొలిచెర్ల, గడ్డం వీరు. సింగర్స్‌-మోహన భోగరాజు, గీతా మాధురి, సాహితి, హరిణి, చరణ్‌, లిప్సిక, అరుణ్‌ కౌండిన్యా, హరనాథ్‌ పొలిచెర్ల, పి.ఆర్‌.ఓ: రాధా వాసంశెట్టి, కధ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం-హరనాథ్‌ పొలిచెర్ల.