నాలోనూ బయటకు కనిపించని యుద్ధం జరుగుతుంటుంది !

‘రియల్‌ లైఫ్‌లో ప్రతి మహిళా యుద్ధనారినే. కాకపోతే మా లోపల మేం యుద్ధం చేసుకుంటుంటాం. అది బయటి ప్రపంచానికి అంతగా తెలియదు’ అని అంటోంది కంగనా రనౌత్‌. మహిళలకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో కంగనా స్పందిస్తుంది.  మహిళలు, వారిలో దాగున్న శక్తుల గురించి కంగనా మీడియాతో మాట్లాడుతూ…. ‘నాలో నేను ఓ వారియర్‌ను చూశాను. నాలోనూ యుద్ధం జరుగుతుంటుంది. కాకపోతే అది అంతగా ప్రసిద్ధి చెందదు. బయటకు కనిపించదు. నేనే కాదు ప్రతి మహిళా తాను నమ్మిన దాని కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. అది కోరికలే కావాల్సిన పనిలేదు. ఇక, పలు ప్రొడక్ట్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్లుగా యువ భారతీయ మహిళలు కావాలి. దానికి నా ఫేస్‌ పర్‌ఫెక్ట్‌ అని భావిస్తున్నాను’ అని తెలిపింది.

పెళ్ళి చేసుకుంటానని సర్‌ప్రైజ్‌ చేసింది ! 

కంగనా రనౌత్‌ అభిమానులకు ఓ స్వీట్‌ న్యూస్‌ తెలిపింది. త్వరలో పెళ్ళి చేసుకుంటానని చెప్పి సర్‌ప్రైజ్‌ చేసింది. ‘పెళ్ళి కచ్చితంగా చేసుకుంటాను. అందుకు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు టైమ్‌ ఇవ్వండి’ అని అని తెలిపింది కంగనా. ఇటీవల ముంబయిలో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్న కంగనా రనౌత్‌ మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించింది. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన ఉందా ? అని మీడియా ప్రశ్నించగా … ‘ఏ నెలలో పెళ్ళి చేసుకోవాలి? ఫిబ్రవరినా? వచ్చే ఫిబ్రవరి వరకు టైమ్‌ ఇవ్వండి. 2019 ఫిబ్రవరిలో కచ్చితంగా పెళ్ళి చేసుకుంటా’ అని సమాధానమిచ్చింది. దీంతో ఆమె పెళ్ళి చేసుకోబోతున్నందుకు అభిమానులు ఓ విధంగా ఖుషి అవుతూనే,  ఆమె  సినిమాలకు దూరమవుతుందేమో? అని బాధపడుతున్నారు. అయితే తను పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి ఎవరన్నది మాత్రం కంగనా వెల్లడించలేదు.

‘కెరీర్‌ కూడా నాకు చాలా ముఖ్యం. నాకు వస్తున్న అవకాశాల విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదు. నాకు ఏం కావాలో,నేనేం చేయాలో అది చేస్తా. ఈ విషయంలో ఎవరు ఎలా ఫీలైనా నాకు సంబంధం లేదు’ అని కంగనా పేర్కొంది. కంగనా ప్రస్తుతం ఝాన్సీ రాణి లక్ష్మిభాయి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో నటిస్తుంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కానుంది.