వెండి తెరకు శివాని రాజశేఖర్ సిద్ధం !

హీరో రాజశేఖర్ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. కొంత గ్యాప్ తీసుకొని.. త్వరలో ‘గరుడువేగ’ సినిమాతో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్ లో ఉన్నాడు రాజశేఖర్. చాలా కాలంగా రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రంపై వార్తలు వినిపిస్తున్నాయి. జీవితా రాజశేఖర్ లు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని కన్ఫామ్ చేసినా.. అది ఎప్పుడన్నది చెప్పలేదు. అయితే ఇటీవల శివానితో చేయించిన ఓ ఫోటో షూట్ ఆమె మూవీ ఎంట్రీపై చర్చకు కారణమైంది. గ్లామరస్ లుక్ లో హీరోయిన్ కు కావాల్సిన అన్ని ఫీచర్స్ తో అదరగొడుతోంది శివాని. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలను చూసి టాలీవుడ్ ప్రియాంక చోప్రా అంటున్నారు సినీ జనాలు. లుక్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్న శివానీ నటిగానూ ఆకట్టుకుంటే స్టార్ స్టేటస్ అందుకోవటం పెద్ద కష్టమేమీకాదు.ఇప్పటికే కొందరు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు శివానిని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్దమవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.