కామెడీ ఎంటర్టైనర్ ‘సౌండ్(మల్టీ బ్రాండ్)’ ప్రారంభం !

కేవీ చౌదరి దర్శకత్వంలో కె.రవీంద్ర నిర్మిస్తున్నచిత్రం “సౌండ్” (మల్టీ బ్రాండ్) కె.సాయి చంద్రిక సమర్పణలో శ్రీ సాయి వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ (SSVCC) పతాకంపై అర్జున్ వారాహి, రేఖా నిరోషా జంటగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శకుడు భీమినేని శ్రీనివాస్ రావు ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, నిర్మాత అచ్చిరెడ్డి దర్శక, నిర్మాతకు స్క్రిప్ట్ అందించారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ నిర్మాత వాసు వర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

చిత్ర నిర్మాత కె.రవీంద్ర మాట్లాడుతూ.. ” చిత్ర దర్శకుడు కేవీ చౌదరి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఫ్యామిలీ అందరు కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు కేవీ చౌదరి మాట్లాడుతూ.. ” మన జీవితంలో ‘సౌండ్’ అనేది చాలా కామన్ వర్డ్.  ఇందులో చాలా హెవీ ఫన్ ఉంటుంది. ఈ నెల 15 నుంచి షూట్ కు వెళ్తున్నాం. హైదరాబాద్, వైజాగ్ లో షూట్  చేస్తాము” అని అన్నారు
హీరో అర్జున్ వారాహి మాట్లాడుతూ.. “మా “సౌండ్ ” సినిమా అందరికీ రీ సౌండ్ వచ్చేలా ఉంటుంది.  సౌండ్ అనే పేరుకు తగ్గ సినిమా ఇది. కామెడీ ఎంటర్టైనర్.  మాస్ ఎలిమెంట్ కూడా పుష్కలంగా ఉంటాయి” అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్:పవన్ గుండుకు, మ్యూజిక్:కపిల్ కుమార్, ఎడిటింగ్ :జె ప్రదీప్ దొడ్డి, ఫైట్స్ :రియల్ సతీష్.