అనిల్‌ రావిపూడి పుట్టినరోజుకు ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌

అనిల్‌ రావిపూడి పుట్టినరోజు నవంబర్‌ 23. అతనికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ.. 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు.’సూపర్‌స్టార్‌’ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో.. జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో.. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.
మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో.. మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది .ఈ టీజర్‌లో అన్నిరకాల ఎలిమెంట్స్‌ ఉండేలా ఎంతో కేర్‌ తీసుకున్నారు. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది.నవంబర్‌ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్‌ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
 
సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం