నమితా శరత్ ల ప్రేమాయణం ….?

నమిత  భారీతనానికి తగ్గ పాత్రలు ఇటు టాలీవుడ్లోనూ, అటు కోలీవుడ్లోనూ లభించడం లేదు. జనం తనని మరిచిపోకుండా ఉండేందుకు ‘తమిళ్ బిగ్‌బాస్’ షో‌లో పాల్గొని అదృష్టాన్ని పరిక్షించుకుంది నమిత.ఆమెకు అందులోనూ చుక్కెదురైంది.కోలీవుడ్ బ్యూటీ నమితకి ఇప్పుడు అవకాశాలే లేకుండా పోయాయి. కోలీవుడ్‌‌లో నిన్న మొన్నటి వరకూ  హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ  అందాల తార…. ఇప్పుడు అరవై  ఏళ్ల సీనియర్ నటుడితో ప్రేమాయణం సాగిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

భారీ అందాలతో తమిళ తంబీలను రెచ్చగొట్టిన నమిత ఇప్పుడు విలక్షణనటుడు శరత్ బాబు‌తో పీకల్లోతు ప్రేమాయణంలో మునిగితేలుతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది. ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు చేసుకున్న శరత్‌బాబు మూడో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట. తానిప్పుడు మూడో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తున్నానని, ఆమె ఒక హీరోయిన్ అని చెప్పి అందరికీ షాకిచ్చాడట. ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. థర్టీ ప్లస్ నమిత… సిక్స్టీ ప్లస్ శరత్ బాబు‌తో బంధం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.