‘కాలా’ రజని విలన్‌ నానా పాటేకర్

ఇప్పుడొచ్చే సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా క్యాస్టింగ్‌పైనే ఫోకస్ పెడుతున్నారు ఫిల్మ్‌మేకర్లు. ఎందుకంటే క్యాస్టింగ్ కారణంగానే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. చివరకు అది సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా అయినా కూడా… క్యాస్టింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం అయిపోయింది. అసలు కబాలి సినిమాలో రజనీ తప్పించి మిగతావారికి మినిమం ఇమేజ్ కూడా లేకపోవడంతోనే ఫ్లాపు టాక్ ఫాస్టుగా వచ్చిందనేది ఒక వాదన. అందుకే ఇప్పుడు ‘కాలా’ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాలో  ప్రముఖ నటుడు నానా పాటేకర్‌ను విలన్‌గా తీసుకుంటున్నారు. అబ్‌తక్ చప్పన్ నుండి మొన్నటి రాజనీతి చిత్రం వరకు బాలీవుడ్‌లో గొప్ప నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు నానా పాటేకర్. ఆయన సినిమాలతో పాటు మరాఠీ నాటకాలలో కూడా నటిస్తాడు. ఇప్పుడు అతను రజనీకాంత్ సినిమాలో విలన్‌గా చేసేందుకు సిద్ధమైపోతున్నాడు. ‘కాలా’లో నానా పాటేకర్ ఒక నీతిలేని రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడట. ముంబయ్‌లో ఉండే తమిళ ప్రజల కోసం రజనీకాంత్…  నానా పాటేకర్  రాజకీయ పార్టీతో గొడవ పెట్టుకుంటాడట. అక్కడి నుంచే సినిమాలో వీరిద్దరి మధ్య గొడవ మొదలవుతుందట. ఈ సినిమాలో రజనీ అల్లుడు ధనుష్ కూడా నటిస్తున్నాడు. పా.రంజిత్  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ధనుష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి, అంజలి పాటిల్, సముద్ర ఖని, పంకజ్ త్రిపాఠిలు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.