నయనతార ‘వసంతకాలం’ ఈనెల 21న

5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై ఇంతకుముందు ‘ఏకవీర’, ‘వెంటాడు-వేటాడు’ వంటి భారీ చిత్రాలు అందించిన  దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ‘సూపర్ స్టార్’ నయనతార నటించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ తమిళ చిత్రాన్ని ‘వసంత కాలం’ పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు.
నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. “టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగి, ఇటు మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’లో మెప్పించి..  అటు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్బార్’లో జత కట్టిన నయనతార నటించిన హీరోయిన్ ఓరియంటడ్ చిత్రం ‘వసంతకాలం’ను అందిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈనెల 21న విడుదల చేస్తున్నాం.  నయనతార నటన-గ్లామర్, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, చక్రి తోలేటి దర్శకత్వం, భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడి తదితరుల పాత్రలు ‘వసంతకాలం’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.