ప్రేమ పచ్చబొట్టుని ‘పాజిటివిటీ’గా మార్చేసింది!

స్టార్ హీరోయిన్‌ న‌య‌న‌తార‌ ప్రేమ టాటూ ( పచ్చ బొట్టు) చెరిపేసిన‌ట్లు తెలుస్తోంది. అప్పట్లో ప్రభు దేవా- న‌య‌న‌తార‌ లు బాగా ప్రేమించుకుంటున్న స‌మ‌యంలో న‌య‌న్ అత‌ని పేరును ప‌చ్చ‌బొట్టు గా పొడిపించుకుంది. ప్ర‌భుదేవా పేరుని స‌గం ఇంగ్లీషులో, మిగ‌తా స‌గం తమిళంలో వేయించుకుంది. వీరి మ‌ధ్య చిగురించిన ప్రేమ ఎక్కువ‌కాలం నిల‌వ‌లేదు. ఏమైందో కానీ ఈ ప్రేమ‌ప‌క్షులు విడిపోయారు. కానీ ఆ టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే న‌య‌న్ ఇటీవల షేర్ చేసిన ఫొటో చూస్తే.. ఆమె టాటూను మార్చివేసిన‌ట్లు తెలుస్తోంది. ‘ప్ర‌భుదేవా’ని కాస్తా రీడిజైన్ లో ‘పాజిటివిటీ’గా మార్చింది.తొలుత శింబుతో..త‌ర్వాత ప్ర‌భుదేవాతో.. ఇలా రెండుసార్లు ప్రేమ బెడిసికొట్ట‌డంతో న‌య‌న్‌ మాన‌సిక వేద‌న‌కు గురైంది.ఆ తర్వాత, దాని నుంచి కోలుకుని సినిమాల‌పై ద‌ష్టి పెట్టిన ఈ హీరోయిన్‌ ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌తో ప్రేమలో ఉన్న విష‌యం తెలిసిందే. 2015 నుంచి వీరిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇప్ప‌టికే రెండుసార్లులో ప్రేమ‌లో విఫ‌ల‌మైన న‌య‌న్ ఈసారైనాపెళ్లి చేసుకోవాలని ఆశిద్దాం.
 
గతాన్ని మర్చిపోయి సంతోషంగా…
జీవితంలో ఏమాత్రం రాజీపడని మనస్తత్వం ఉన్నవారు అపజయాల్ని పాఠాలుగా తీసుకొని భవిష్యత్తును మరింత జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటారు. తాను ఆ కోవకు చెందిన మహిళనని చెబుతోంది నయనతార. ఆమెకు గతంలో శింబు, ప్రభుదేవాతో విఫల ప్రేమ అనుభవాలున్నాయి. తన లవ్‌ఫెయిల్యూర్‌ గురించి ఆమె మాట్లాడుతూ… ‘పరస్పర విశ్వాసంలేని ప్రేమలు ఎక్కువ కాలం నిలబడలేవు. స్త్రీపురుషుల బంధంలో అన్నింటికంటే ప్రధానమైంది నమ్మకం. నా విషయంలో అదే జరిగింది. నమ్మకం లేకుండా కలిసి జీవించలేనని విడిపోయాను. ఆ సమయంలో నేను తీవ్ర మనోవేదనకు గురయ్యాను. కెరీర్‌ మీదున్న ప్రేమే నన్ను ఆ కష్టాల నుంచి బయటపడేసింది. ఆ కుంగుబాటు నుంచి బయటపడటానికి సినిమాలే తోడ్పడ్డాయి. ప్రస్తుతం గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉన్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నయనతార తమిళ దర్శకుడు విఘ్నేష్‌శివన్‌తో ప్రేమలో ఉంది. త్వరలో వీళ్లిద్దరు పెళ్లిపీటలెక్కబోతున్నారట .
 
కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో ?
నయనతార ఒక్క కమల్‌ హాసన్‌తో తప్ప.. టాప్‌ స్టార్స్‌ నుంచి యంగ్‌ హీరోస్‌ వరకు అందరితో చేసింది. ఇప్పుడు కమల్ కాంబినేషన్‌ కలవబోతోందని కోలీవుడ్‌ వార్త . దర్శకుడు గౌతమ్‌ మీనన్, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో ‘రాఘవన్‌’) సినిమా వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందిస్తున్నారు గౌతమ్‌ మీనన్‌. ఇందులో హీరోయిన్‌గా అనుష్క నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ‘నయన ఇన్‌ రాఘవన్‌’ వార్త నిజమేనా? ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.