ఆశించినంత లేదు … ‘కేశవ’ చిత్ర సమీక్ష

ఆశించినంత లేదు ….‘కేశవ’ చిత్ర సమీక్ష

                           సినీవినోదం రేటింగ్ : 2.5/5

అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్ పై  సుధీర్‌ వర్మ రచన దర్శకత్వం లో అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు

కాకినాడ లా కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పి. కేశవ శర్మ(నిఖిల్) అరుదైన గుండె జబ్బుతో ఇబ్బంది పడుతుంటాడు. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె, తనకు కుడి పక్కన ఉంటుంది. దీని కారణంగా ఏ మాత్రం ఆవేశపడినా, అలిసి పోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కేశవ వరుసగా పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన తరువాత చిన్న క్లూ కూడా వదిలి పెట్టకుండా.. చనిపోయిన వారి శవాలను ఉరి వేసి వెళ్లిపోతాడు. అదే సమయంలో కాలేజ్ లో జాయిన్ అయిన కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ(రీతూ వర్మ), అతన్ని గుర్తు పట్టి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ హత్యలు చేస్తుంది ఎవరు..? కారణం ఏంటి..? అన్న విషయం కనిపెట్టేందుకు పోలీస్ డిపార్టెమెంట్ కేసును స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా(ఇషా కొప్పికర్) కు అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన షర్మిలకు కేశవ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు..? అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? స్పెషల్ ఆఫీసర్ షర్మిలా ఈ కేను ఎలా సాల్వ్ చేసింది..? ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరకు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

నిఖిల్ తో రెండో సినిమా చేసిన సుధీర్ వర్మ మరోసారి అద్భుతమైన టేకింగ్ తో  ఆకట్టుకున్నాడు. ‘రివెంజ్ డ్రామా’ అనే అంశానికి కట్టుబడి ఆరంభం నుండి చివరి దాకా సినిమాను ఎలాంటి డీవియేషన్స్ లేకుండా , తక్కువ రన్ టైమ్ తో  నడిపాడు .   ‘వయసు పరంగా హీరో ఎదగడం’ అనే అంశాన్ని ఆసక్తికరమైన పద్దతిలో చూపించాడు.కథానాయకుడి పగకు అసలు కారణం ఏమిటనేది , దాని చుట్టూ అల్లుకున్న డ్రామా బాగున్నాయి.

అయితే, సినిమా  ఆరంభం బాగానే ఉన్నా, హీరో హత్యలు చేయడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడం వంటి సన్నివేశాల్లో కొత్తదనమంటూ ఏం లేదు. పైగా వాటిలో అంత తీవ్రమైన భావోద్వేగాలు కూడా కనిపించలేదు. అలాగే హీరోకు ఎడమ వైపు ఉండాల్సిన గుండె కుడి వైపు ఉంటుందని ఆరంభంలో చెప్పడమేగాని దాన్ని కథనంలో ఊహించినంత గొప్పగా ఎలివేట్ చేయలేదు.పోలీసులు హీరోను ఆపలేకపోవడం, అతను శిక్ష నుండి తప్పించుకోవడం వంటి అంశాలు మరీ నాటకీయంగా  తేలిపోయాయి. ట్రైలర్లలో హీరో పాత్ర పరిస్థితుల ప్రభావంతో చాలా వైల్డ్ గా మారుతుందనే అంచనా కలిగించారేగాని తెర మీద మాత్రం హీరో పాత్ర సాఫ్ట్ గానే పోతుంటుంది తప్ప ఉద్వేగ  స్థాయికి చేరుకోకపోవడం నిరాశ  కలిగించింది.

ఇంటర్వెల్‌ పాయింట్‌ దాటిన తర్వాత ఎక్సయిట్‌మెంట్‌ లోపిస్తుంది. ఇటు హీరోయిన్‌ కన్విన్స్‌ అయిపోవడం, అటు పోలీసులు బేలగా మారిపోవడం, హీరో రివెంజ్‌ వెనుక కారణాలేంటనేది క్లియర్‌గా తెలిసిపోవడంతో, బ్యాలెన్స్‌ ప్రతీకారం తీర్చుకోవడం మినహా ఇక స్క్రీన్‌ప్లేని బలం గా నడపడానికి ఎలాంటి ఆసక్తికరమైన ఎలిమెంట్‌ లేకుండా పోయింది. చివర్లో చిన్న ట్విస్ట్‌ ఇచ్చినప్పటికీ, ఆ సీక్రెట్‌ హీరోకి ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది, విలన్‌ ఆచూకీ ఎలా దొరికింది వగైరా విషయాలకి వివరణ  లేకపోవడంతో ఆ ట్విస్ట్‌ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది .

చలాకీ పాత్రలు చేసే నిఖిల్‌ ఈ సీరియస్‌ క్యారెక్టర్‌లో మెప్పించాడు. నటుడిగా తనలోని ఇంకో కోణాన్ని చూపించాడు. రఫ్ లుక్‌తో  పాత్రలో ఒదిగిపోయాడు,న్యాయం చేశాడు.  పోలీస్‌ అధికారిగా ఇషా కొప్పికర్‌ సరిపోయింది .మంచి నటనను కనపరిచింది.  రీతు వర్మకి ఎక్కువ ఇంపార్టెన్స్‌ లేదు.  పాత్ర పరిమితమే అయినా  చక్కగా నటించింది.రావు రమేష్‌ కనిపించేది కాసేపే అయినా తన సహజ నటనతో మెప్పించారు.వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ బాగుంది . ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రవికాంత్‌, రాజా రవీంద్ర తమ పాత్రలకు న్యాయం చేశారు.

సన్ని ఎం.ఆర్‌. సంగీతం బావుంది. పాటలన్నీ సందర్భోచితంగానే ఉన్నాయి . అలాగే ప్రశాంత్‌ పిళ్ళై బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా బావుంది. దివాకర్‌ మణి సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. సినిమాకి అవసరమైన మూడ్‌ తో ,ప్రతి సీన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఎస్‌.ఆర్‌. శేఖర్‌ ఎడిటింగ్‌ ఓకే   – ధరణి

REVIEW OVERVIEW
కేశవ
SHARE