ఈమెకు పది కోట్ల మంది ఫాలోయర్లు !

పాప్ సింగర్ , హాలీవుడ్ సంచలనం కేటి పెర్రీ ట్విట్టర్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. శుక్రవారం ఆమె ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య 100 మిలియన్లకు చేరుకుంది. దీంతో పది కోట్ల ఫాలోయర్లను సొంతం చేసుకుని ట్విట్టర్ లో  ఆమె అరుదైన ఘనత వహించారు. ఈ అరుదైన మార్క్‌ను అభిమానుల వల్లే చేరుకోగలిగానని వారికి ధన్యవాదాలు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఫాలోయర్లు ఎక్కువగా ఉన్నారని ఇతర సెలబ్రిటీల ఫ్యాన్స్ కొందరు ఇటీవల కేటి ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి,అసభ్య సందేశాలు పోస్ట్ చేయడం తెలిసిందే.

ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్ ‘విట్‌నెస్‌’ తో ఈవెంట్లలో బిజీగా ఉంది కేటి. 2015లో ఆమె కో డ్యాన్సర్ షార్క్ డ్రెస్ ధరించడంతో అప్పటో హాట్ టాపిక్‌గా నిలిచింది. ’96 అవర్’, ‘బిగ్ బ్రదర్’ లాంటి ప్రొగ్రామ్‌లతో 190 దేశాల అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు ఫాలోయర్ల సంఖ్యను అమాంతం రెట్టింపు చేసుకుంది. 100 మిలియన్ ఫాలోయర్లతో కేటి అగ్రస్థానంలో నిలవగా.. 97 మిలియన్లతో పాప్ సింగర్ జస్టిన్ బీబర్, 85 మిలియన్ ఫాలోయర్లతో మరో పాప్ సంచలనం టేలర్ స్విఫ్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.