పోర్న్‌సన్నీ బాలీవుడ్‌ హవా : వెబ్‌సిరీస్‌ వచ్చేస్తోంది !

సాధారణ అమ్మాయి నుంచి పోర్న్‌ స్టార్‌గా తరువాత బాలీవుడ్ నటిగా మారిన సన్నీలియోన్‌ జీవితం తెర మీదకు రానుంది. కానీ ఇది వెండి తెర మీద కాదు, వెబ్‌ సిరీస్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌ బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. బాలీవుడ్‌లో వెబ్‌సిరీస్‌లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. కొన్ని విషయాలు సినిమాగా తెరకెక్కిస్తే సెన్సార్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే దర్శక నిర్మాతలు వెబ్‌ సీరీస్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.

సన్నీలియోన్‌ జీవితం ఆధారంగా చిత్రం అంటే… అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. వీటికి సెన్సార్‌ కత్తెరలు పడతాయని, అందుకే వెబ్‌సిరీస్‌ల ద్వారా ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. సన్ని లియోనే బయోపిక్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఈ బయోపిక్‌ను చూడాలంటే  నిర్ణీత సొమ్మును వసూలు చేస్తారట.

‘కరణ్‌జీత్‌ కౌర్‌ ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోన్‌’ గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో… సన్నీకి చిన్నతనంలో ఎదురైన అనుభవాలు, పోర్న్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం, పోర్న్‌ స్టార్‌గా ఎదగడం, అవన్ని వదిలిపెట్టి బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడం, ఇక్కడ తన హవా కొనసాగించడం లాంటివి చూపించనున్నట్లు తెలుస్తోంది.  కరణ్‌ జీత్‌ కౌర్‌ వోహ్రా అనేది సన్నిలియోన్‌ అసలు పేరు.