ఇబ్బందుల్లో ఉన్నవారికి పూరి ‘హెల్పింగ్ హ్యాండ్’

పూరి జగన్నాధ్ పుట్టిన రోజున దర్శకత్వ శాఖలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న30 మందికి “హెల్పింగ్ హ్యాండ్స్” పేరుతో ఒక్కరికి 50,000 ల చొప్పున 15 లక్షల ఆర్థికసాయం చేశారు.
 
‘పూరి కనెక్ట్స్’ నిర్మాత ఛార్మికౌర్ ఈ సందర్భముగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ” ఒక సారి పూరి గారు నేను కూర్చొని ఉన్నప్పుడు.. నీకో విషయం తెలుసా? దాసరి గారు నా గురించి ఎంత పెద్ద మాట అన్నారో.. “నా తరువాత పూరి జగన్నాధ్ నా వారసుడు” అన్నారు.. అని పూరి చాలా ఎమోషనల్ గా చెప్పారు. ఆరోజు నుండే నా మనసులో దాసరి వంటి లెజండరీ పర్సన్ పూరి గారికి ఇంత మంచి పొజిషన్ ఇచ్చినప్పుడు.. ఆ గౌరవాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్లాన్ చెయ్యడం జరిగింది.
ఆరోజు పూరి ఇచ్చిన ధైర్యం తో ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేశాం. ఈరోజు మేము మీకు ‘హెల్పింగ్ హ్యాండ్’ అయి ఉండొచ్చు కానీ.. పూరి గారిని నమ్మి ఈ సినిమా చేసిన రియల్ హీరో రామ్ పోతినేని… రామ్ మాకు ‘హెల్పింగ్ హ్యాండ్’ అయ్యారు . ఆయన ఇచ్చిన సపోర్ట్ తోనే ఈరోజు మేము ఈ సాయం చేస్తున్నం. ప్రతి సంవత్సరం పూరి గారి పుట్టిన రోజున  ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. పూరి గారు మీ అందరి కోసం మంచి మెస్సేజ్ పంపారు …” నీకు ఇష్టమైన పని కోసం.. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దానికోసం చావడమే దాని గెలుపు” అని పూరి సందేశాన్ని చదివారు.
 
కాశి విశ్వనాధ్, నటుడు ఉత్తేజ్, డైరెక్టర్స్ యూనియన్ సెక్రటరీ… రామ్ ప్రసాద్, సుబ్బా రెడ్డి , భాస్కర్ రెడ్డి , విష్ణువర్ధన్, ఆదుర్తి రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.