‘షూటింగ్స్‌ను బాగా మిస్సయ్యా’నంటూ ప్రారంభించేసింది!

కరోనా సమయంలో షూటింగ్ అంటే చాలా పెద్ద సాహసం. సౌత్ ఇండియాకు చెందిన స్టార్ హీరోయిన్స్ లో రకుల్ మాత్రమే షూటింగ్‌లో పాల్గొననుంది.”ఈ బ్రేక్‌లో షూటింగ్స్‌ని బాగా మిస్సయ్యాను” అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పుడు మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటోంది రకుల్‌. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌లో షూటింగ్‌లకు బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.. ఇటీవల అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా కేంద్రం షూటింగ్‌లను గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో మళ్లీ చిత్రీకరణ మొదలు పెడుతున్నారు. ఇప్పటికే ఆమిర్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ‌షూటింగ్‌లను తిరిగి ప్రారంభిస్తే.. కరోనా జాగత్తలు పాటిస్తూ మరి కొంత మంది షూటింగ్‌లలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ త్వరలో మూవీ షూటింగ్‌ స్టార్ట్‌ చేయనుంది.
వికారాబాద్‌ అడవుల్లోషూటింగ్‌ స్టార్ట్‌
‘ఉప్పెన’ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న చిరంజీవి మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా అంగీకరించారు. క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై జాగర్లమూడి సాయిబాబు, వై. రాజీవ్‌రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ‘‘అడవి నేపథ్యంలో జరిగే కథ ఇది. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెట్టాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయడానికి క్రిష్‌ సన్నాహాలు చేస్తున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.ఈ సినిమాకు తాజాగా వికారాబాద్‌ అడవుల్లో షూటింగ్‌ ప్రారంభించారు.ఏకధాటిగా 45 రోజులు షూట్‌ చేసి, ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా షుటింగ్‌లో పాల్గొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మేకప్‌ వేసుకుంటున్న ఓ చిన్న వీడియోను షేర్‌ చేసి.. ‘ఇన్నాళ్లూ షూటింగ్స్‌ను బాగా మిస్సయ్యాను’ అని రాసుకొచ్చింది రకుల్‌. ఈ సినిమాతో పాటు మరో హిందీ సినిమా షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేయనున్నారామె. అర్జున్‌ కపూర్‌తో ఆమె నటిస్తున్న హిందీ సినిమా చిత్రీకరణ ఈ నెల 25న ప్రారంభం కాబోతోంది. నాలుగైదు నెలల తర్వాత ఇలా బిజీ కావడం హ్యాపీగా ఉందంటున్నారు రకుల్‌.ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.
ముంబైలో అర్జున్‌ కపూర్‌ సినిమాలో..
నిర్మాత బోనీ కపూర్‌ కొడుకు అర్జున్‌ కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు పేరు వెల్లడించలేదు. ఈ మూవీ షూటింగ్‌ ఆగష్టు 25 నుంచి ముంబైలో ప్రారంభం కాబోతుంది.ప్రస్తుతం 10 రోజులపాటు షెడ్యూల్‌ ఉందని, ఆ తర్వాత సెప్టెంబర్‌ చివరలో మరో నాలుగు రోజు షూట్‌ చేయనున్నట్లు తెలిపారు. లవ్‌ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాతో కాశ్వీ నాయర్‌ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. భూషణ్ కుమార్, జాన్ అబ్రహం, నిఖిల్ అద్వానీ, మధు భోజ్వానీ, క్రిషన్ కుమార్, మోనిషా అద్వానీ నిర్మిస్తున్నారు.