రంజిత్, పాలక్ లల్వానీ హీరో, హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `జువ్వ`. `దిక్కులు చూడకు రామయ్య` ఫేం త్రికోటి పేట దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్. వి. రమణ సమర్పణలో సొమ్మి ఫిలింస్ పై డా. భరత్ సోమి నిర్మిస్తున్నారు. ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమా హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో దర్శకుడు రాజమౌళి అండ్ ఫ్యామిలీ, నిర్మాత దిల్ రాజు, వైకాపా నాయకుడు బొత్స సత్సనారాయణ చేతుల మీదుగా ఆ మధ్య ప్రారంభమైంది.
ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుంది. హైదరాబాద్ లో కొన్ని సన్నివేశాలు, వైజాగ్ లో ఒక పాట..మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే మలేషియాలో రెండు పాటలు, బెంగుళూరులో కారు ఛేజింగ్ సన్నివేశాలు షూట్ చేశారు. తాజాగా యూనిట్ ప్రమోషన్ యాక్టివీటీస్ ను కూడా ప్రారంభించింది. దీనిలో భాగంగా నేడు చిత్ర మోషన్ పోస్టర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. అతి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫస్టు లుక్ పోస్టర్ మరియు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ తెలిపింది. అలాగే ఇదే నెల మూడవ వారంలో ఆడియోను, ఫిబ్రవరి లో సినిమా రిలీజ్ కు నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఇందులో పోసాని కృష్ణ మురళి, అలీ, సప్తగిరి, మురళీ శర్మ, రఘుబాబు, ప్రభాకర్, విజయ్ చందర్, ఆనంద్, ఐనాక్స్ వెంకట్, పింగ్ పాంగ్ సూర్య, జబర్ధస్త్ శ్రీను, షేకింగ్ షేషు, సారిక రామచంద్రరావు, ఏడిద శ్రీరాం, మోహన్ రావు, హిమజా, మునిరాజు, లత, తులసి, ప్రసన్న కుమార్, ప్రభాష్ శ్రీను, రాజేష్, భద్రమ్, సురేఖా వాణి, సనా, దువ్వాసి మోహన్ , ప్రజ్వాల్, ఆయుష్, ఎస్తార్ అనీల్, విష్ణు ప్రియ, పద్మజా, ఫరీద్, కబీర్, అజర్, నాగు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు: ఎమ్. రత్నం, సాహిత్యం: అనంత శ్రీరాం, వశిష్టి, కొరియోగ్రఫీ: గణేష్, జానీ, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు, యాక్షన్: వెంకట్, నందు, ఆర్ట్: రామ్ అరసవిల్లి, సినిమాటోగ్రఫీ: సురేష్, సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి, నిర్మాత : డా. భరత్ సోమి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త‌్రికోటి పేట.