నాగ చైతన్య, సమంతల చిత్రం షూటింగ్ ప్రారంభం

స‌మంత‌, నాగ చైత‌న్య… పెళ్ళి త‌ర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది..  నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.. ‘నిన్నుకోరి ‘ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమా కి  దర్శకత్వం వహిస్తున్నారు.. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు.. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది  ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు..  పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో  ఈ  చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది..
నటీనటులు :
 నాగ చైతన్య, సమంతా, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్, రాజశ్రీ నాయర్
సాంకేతిక నిపుణులు :
రచన మరియు దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది,బ్యానర్: షైన్ స్క్రీన్స్ బ్యానర్
సంగీతం: గోపీ సుందర్, డిఓపి : విష్ణు శర్మ, ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి,యాక్షన్: వెంకట్

Naga Chaitanya, Samantha, NC17 shoot Begins

The new film in the combination of real life couple, hero Naga Chaitanya and actress Samantha has commenced shooting in Hyderabad.
Both Chaitanya and Samantha are taking part in the schedule of shooting which is going to be a lengthy one. Shiva Nirvana who made his debut with the superhit ‘Ninnu Kori’ is directing this yet to be titled movie.
Actress Divyansha Kaushik will be seen in the second female lead role while the supporting cast includes Rao Ramesh, Posani Krishna Murali,subba raju.
Gopi Sunder will be composing tunes for this film which is touted to be a romantic drama.
Sahu Garapati and Harish Peddi are producing the movie under Shine Screens banner.
Cast:
Naga Chaitanya, Samantha, Divyansha Kaushik, Rao Ramesh, Subbaraju, Posani Krishna Murali, Tanikella Bharani, Ravi Prakash, Karan, Rajasri Nair
Crew:
Written and direction: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi,Banner: Shine Screens
Music: Gopi Sunder,DoP: Vishnu Sarma
Art director:Sahi Suresh,Editor: Prawin Pudi,Action: Venkat