కంగనా ధైర్యానికి సమంత ప్రశంసలు !

కంగనా రనౌత్ ధైర్యం నచ్చిన సమంత ” లెజెండరీ.. ధైర్యానికంటూ ఓ ముఖం ఉంటే అది నువ్వే మై క్వీన్.. ” అని ట్వీట్ పెట్టింది. సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమంత వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన కంగనా రనౌత్ పై ప్రశంసలు కురిపించింది. ఆ మధ్య హృతిక్, ఆదిత్య పంచోలిపై చేసిన కామెంట్స్ తో వార్తలలోకి వచ్చిన కంగనా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలని టార్గెట్ చేస్తూ ఓ పాట రూపొందించింది. ఈ పాటని బట్టి చూస్తే హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమాలలో వాడుతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తుంది. మహిళా సాధికారత ప్రకటించేందుకే ఈ సాంగ్ చేసిందని చూసిన వారికి స్పష్టం గా తెలుస్తుంది.

“చిట్టియా కలైయా వే” పాటను రీరైట్ చేసి.. “కాజ్ ఐ హ్యావ్ వెజైనా రే” అంటూ మార్చిన పాటలో దర్శకుడు ‘హీరోకి హారతి పళ్ళెం పట్టి స్వాగతం చెప్పడం’,’ హీరోకి భజన చేయడం’ వంటివి ఇప్పటి రోజుల్లో జరుగుతున్నాయని ఈ పాటతో చెప్పేసింది. ఫిమేల్ లీడ్ అంటే ‘హీరోయిన్ ని దర్శకుడు గుర్తు పట్టకపోవడం’.. ‘లవ్ ఇంట్రెస్ట్ అంటేనే గుర్తుకు రావడం’ ‘ఫెమినా జీ.. అంటూ పాటలో హీరో తో  పలికించడం’.. ఆ తర్వాత ‘హీరో పేర్ల తర్వాత మా పేర్లు’.. కానీ ‘మా కంటే వాళ్ల చెక్కులలో ఎక్కువ సున్నాలు’ అంటూ కౌంటర్లు వేయడం… ఇలా ఒక పాటలో ఎన్ని చేయచ్చో అన్నీ చేసేసింది కంగనా రనౌత్.

ఇది నచ్చిన సమంత ‘లెజెండరీ.. ధైర్యానికంటూ ఓ ముఖం ఉంటే అది నువ్వే మై క్వీన్..’ అని ట్వీట్ పెట్టింది.ఆ విధం గా మహిళా సాధికారత కు తన మద్దతు పలికింది.  ఈ మధ్య జ్యోతిక కూడా పురుషాధిక్యతపై మండిపడింది. “చిత్ర పరిశ్రమలో హీరోల సినిమాలు ఎంత చెత్తగా ఉన్నప్పటికి నాలుగైదు రోజులు ఆడుతుంది. అదే లేడి ఓరియెంటెడ్ సినిమా ఎంత మంచి కథతో రూపొందినప్పటికి వారం తర్వాత వసూళ్ళు రావడం మొదలవుతాయి. మహిళలకి ఈ రంగంలో ప్రాముఖ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితులు మారాలి!” గట్టిగా చెప్పింది. ఏదేమైనా బాలీవుడ్ ప్రముఖుల తీరును విమర్శిస్తూ కంగన తీసిన ఓ మ్యూజిక్ వీడియో ప్రస్తుతం బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.