సంజీవ్ మేగోటి ‘ఎర్ర గుడి’ షూటింగ్ ప్రారంభం !

ఎర్రగుడి (అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమ కథ) అన్విక ఆర్ట్స్ వారి చిత్ర ప్రారంభోత్సవం 19వ తేదీ  జరిగింది. 1990’s లో సామాజిక స్థాయి బేధాలు, పరువు హత్యలు ప్రేమికుల పాలిట శాపాలుగా నడుస్తున్న కాలంలో, కట్టుబాట్లకి, సాంప్రదాయాలకి, ప్రేమ అతీతమైనదని అమ్మవారే సాక్షి గా నిలిచి.. గెలిపించిన సరి కొత్త ప్రేమ కథ ఇది.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ఎర్రగుడి సినిమా లవ్, సెంటిమెంట్, స్పిరిట్యువల్ అంశాలతో ఉంటుంది. 1975 ప్రాంతంలో కథ మొదలై – 1992 తో పూర్తివుతుంది. గ్రామీణ  నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ప్రేమకథ ఇది. ఆదిత్య ఓం, సత్య ప్రకాష్, ఎస్తేర్, సమ్మెట గాంధీ, అజయ్ ఘోష్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అందరి సహకారంతో “ఎర్రగుడి” సినిమాని మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తాం అన్నారు.
నిర్మాణ సారధి ఘంటా  శ్రీనివాస రావు మాట్లాడుతూ.. పర్ఫెక్ట్  ప్లానింగ్తో ‘ఎర్ర గుడి” చిత్రం నిర్మాణం చేస్తున్నాం. కమర్షియల్ గా ఈసినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ ఆర్.డి.ఎస్.. మాట్లాడుతూ.. సంజీవ్ మేగోటి గారికి డైరక్టర్ 12వ సినిమాఇది . అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరిన సినిమా ఎర్రగుడి. మా టీమ్ అందరం గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఫలితం వస్తుందని నమ్ముతున్నాం అన్నారు.

నటులు సమ్మెట గాంధీ మాట్లాడుతూ.. సంజీవ్ గారు మల్టీటాలెంటెడ్ పర్సన్. నాకు ఈ సినిమాలో కొత్త తరహా పాత్ర ఇచ్చారు. ఈ “ఎర్రగుడి” సినిమా అమ్మవారి ఆశీస్సులతో పెద్ద విజయం సాధిస్తుంది అన్నాడు.

హీరో- వెంకట్ కిరణ్, హీరోయిన్ శ్రీజిత ఘోష్.. ఇతర పాత్రల్లో ఆదిత్య ఓం, రఘుబాబు, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, ఎస్తేర్, అజయ్ ఘోష్, ఢిల్లీ రాజేశ్వరి, వనిత రెడ్డి, రాజేష్ చీరాల, జ్యోతి, శ్రావణి, అయేషా, దేవిశ్రీ ప్రభు, రామ్ రమేష్, హరీష్ నటిస్తున్న ఈ చిత్రానికి  సినిమాటోగ్రఫీ : ఎస్.ఎన్ .హరీష్ , సంగీతం : మాధవ్ సైబా, రామ్ సుధి, సంజీవ్, లిరిక్స్ : సాగర్ నారాయణ, రాజాపురం శ్రీనాథ్ రెడ్డి,ఫైట్స్ : నటరాజ్, కొరియోగ్రఫీ: సూర్యకిరణ్, అనీష్, ఆర్ట్ : కె.వి. రమణ,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గోరెంట శ్రావణి.