‘సంతోషం సౌతిండియా సినిమా అవార్డ్స్’ కర్టైన్ రైజర్ వేడుక !

“సంతోషం” పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి సంకల్పంతో కేవలం ఒకే ఒక్కడై.. తెలుగు సినిమా రంగానికి అవార్డులందిస్తూ ఈ వేడుకలను గత ఇరవై ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.  14న హైద్రాబాద్ లో జరగబోయే ‘సంతోషం సౌతిండియా సినిమా అవార్డ్స్’ కార్యక్రమం ఈ సారి ఎన్ స్క్వేర్ సమర్పణలో సుమన్ టీవీ భాగస్వామంతో ఈ వేడుకల నేపథ్యంలో శుక్రవారం కర్టైన్ రైజర్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అథితులుగా ప్రముఖ నటుడు ఆలీ, ఇంద్రజ, సుశాంత్, పూరి ఆకాష్, దివి, హమీద, అక్సఖాన్ , హెబ్బా పటేల్, ఎన్ స్క్వేర్ ఎండి నవీన్ రెడ్డి, సుమన్ టివి సి ఈ ఓ పద్మజ తదితరులు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నటుడు ఆలీ చేతుల మీదుగా సంతోషం – సుమన్ టివి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేడుక బ్రోచర్ లాంచ్ చేసారు

ఆలీ మాట్లాడుతూ … “అవార్డులు  20 సంవత్సరాలు ఇవ్వడం అన్నది మాములు విషయం కాదు. సినిమా పెద్ద వారంతా ఈ వేడుకలకు హాజరవ్వడం మాములు విషయం కాదు. సంతోషం అవార్డు వేడుకలకు సుమన్ టివి తోడైంది. సురేష్ ఈ అవార్డు వేడుకలు 20 ఏళ్ళు కాదు మరో ఇరవై ఏళ్ళు ఇలాగె కొనసాగాలని కోరుకుంటున్నాను. సంతోషం, సుమన్ టివి. వీరిద్దరి కలయికలో జరుగుతున్న ఈ వేడుకల్లో ఒక్క తెలుగు నుండే కాదు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల వారు పాల్గొంటున్నారు తప్పకుండా ఈ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ ..  “నేను కృష్ణగారి అభిమానిని, ఆ తరువాత చిరంజీవి గారి ప్రోత్సహంతో నేను ఈ రంగంలో ఎదిగాను. ఈ అవార్డు వేడుకలు జరపడానికి కారణం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరు. కరోనా ఎఫెక్ట్ తో గత రెండు సంవత్సరాలు ఈ వేడుకలు జరపలేదు.ఈ సారి గ్రాండ్ గా ఈ అవార్డు వేడుకలను మరో ఇరవై ఏళ్ళు గుర్తుండిపోయేలా నిర్వహిస్తున్నాం. ఈ సారి అవార్డు వేడుకలు నిర్వహించడం విషయంలో ‘సురేష్ నీకు నేనున్నాను’ అంటూ సపోర్ట్ చేసిన ఎన్ స్క్వేర్  ఎండి నవీన్ రెడ్డి కి థాంక్స్ చెబుతున్నాను. ఎస్పీ బాలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనకు వందమంది సింగర్స్, వంద పాటలతో గ్రాండ్ ట్రిబ్యూట్ ఇస్తున్నాం. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ రంగాలకు సంబందించిన స్టార్స్ కూడా వస్తున్నారు. ఈ వేడుకల్లో అందరు పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేస్తారని  కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ ఇంద్రజ మాట్లాడుతూ .. “సురేష్ గారు నాకు హీరోయిన్ అయినప్పటినుండి తెలుసు. సంతోషం, సుమన్ టివి ఇద్దరు కలిసి ఈ అవార్డు వేడుకలు నిర్వహించడం నిజంగా మంచి విషయం. సంతోషం అవార్డు వేడుకలు 20 ఏళ్లుగా జరుగుతుంటే నన్ను ఎప్పుడు పిలవలేదు.. కానీ ఈ సారి అవార్డు వేడుకల్లో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుకల్లో చిరంజీవి గారి సాంగ్ కి డాన్స్ చేస్తున్నాను” అన్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ … “సంతోషం చాలా పాజిటివ్  వైబ్స్ ఉన్నాయి. నా మొదటి ఇంటర్వ్యూ ని సురేష్ గారికే ఇచ్చాను. ఈ వేడుకలను గత ఇరవై ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్న సురేష్ గారి సంకల్పం బలం  ఏమిటో అర్థం అవుతుంది” అన్నారు.

పూరి ఆకాష్ మాట్లాడుతూ … “సురేష్ గారు ఎంత డెడికేషన్ తో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారో అర్థం అవుతుంది. ఈ అవార్డు వేడుకల ప్రోమో చూస్తుంటే నాకు రావాలని ఎగ్జైట్ గా ఉంది .. ఆల్ ది బెస్ట్ సురేష్ గారు” అన్నారు.

హీరోయిన్ మన్నారా చోప్రా మాట్లాడుతూ .. “సంతోషం అవార్డ్స్ వేడుకల్లో పాల్గొనడం నాకు ఇది నాలుగో సారి. నాకు చాలా ఇష్టమైన అవార్డుల వేడుక ఇది. సురేష్ గారు నాకు ఇంతమంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది” అన్నారు.