సోహైల్,మోక్ష జంటగా అభి దర్శకత్వంలో లక్కీ లక్ష్మణ్

వైష్ణవి ఆర్ట్స్, దత్తాత్రేయ మీడియా  పతాకంపై సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని, రమ్య ప్రభాకర్ లు నిర్మిస్తున్న “లక్కీ లక్ష్మణ్”. ఈ చిత్రం  వైభవంగా ప్రారంభమైంది. “చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే” అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన ఆసక్తికర పరిణామాలతో అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’.  నిర్మాతలు మిరియాల రవీంద్ర రెడ్డి, బెక్కం వేణుగోపాల్, పుప్పాల రమేష్, రాజా రవీంద్ర  లు స్క్రిప్ట్ ను అందించగా,  దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో సోహైల్ హీరోయిన్ మోక్ష లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్  గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అప్పిరెడ్డి “లక్కీ లక్ష్మణ్” మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

చిత్ర నిర్మాత హరిత గోగినేని మాట్లాడుతూ.. కెరీర్ పరంగా ఐటి రంగంతో స్టార్ట్ అయిన నా జర్నీ రియల్ ఎస్టేట్ రంగంలో సెటిల్ అయ్యాను. దర్శకుడు అభి పడే తపన చూసి నా రియల్ ఎస్టేట్ బిజినెస్ ను పక్కనపెట్టి  ‘నీ కోసం నేనే సినిమా చేస్తాను. మంచి కథ ఉంటే చెప్పామన్నా’ను. అభి చెప్పిన కథ ఫ్రెష్ గా అనిపించడంతో  ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాము. ఈ సినిమాకు హీరోగా ఎంతో కష్టపడే  సోహైల్ అయితే ఈ సినిమాకు కరెక్ట్ అని దర్శకుడు అభి చెప్పడంతో తనను హీరోగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్నారు.
హీరో సొహైల్ మాట్లాడుతూ.. చాలా మంది సొహైల్ సినిమా మీద సినిమా ఒప్పుకుంటున్నాడు ఏంటి అనుకోవచ్చు.అయితే నాకు కథ నచ్చితేనే సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాను.మా దర్శక, నిర్మాతలకు సినిమాపై ఎంత ప్యాషన్ ఉందో సినిమా కథలను సెలెక్ట్  చేసుకోవడంలో కూడా అంతే అభిరుచిని కలిగి ఉన్నారు ఈ సినిమాకు టెక్నికల్ పరంగా, ఔట్ ఫుట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండాక్ సీనియర్ టెక్నీషియన్స్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి మంచి లేడీ ప్రొడ్యూసర్ లు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు
చిత్ర దర్శకుడు అభి మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్  లక్కీ కూడా కథలోనుండి వచ్చిందే..ఆ తరువాత సోహైల్ కు ఈ కథ చెప్పగానే తను ఫస్ట్ సిట్టింగ్ లోనే చేయడానికి ఒప్పుకున్నాడు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా తను డిఓపి అండ్రూ, అనూప్ రూబెన్స్, ప్రవీణ్ పూడి వంటి సీనియర్ టెక్నిషన్స్ ను తీసుకువచ్చారు. డీఫ్రెంట్ సబ్జెక్టు తో  వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. “లక్కీ లక్ష్మణ్” టైటిల్ లోనే లక్ ఉన్నట్టు సొహైల్ కు కూడా మంచి లక్ ఉంది.  ఈమధ్య డీఫ్రెంట్ సబ్జెక్ట్స్ లను సెలెక్ట్  చేసుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న సొహైల్  తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆయుస్మాన్ ఖురాన్ లా ఎదగాలని కోరుకుంటున్నాను అన్నారు.

సోహెల్, మోక్ష, దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ తదితరులు ఈ చిత్రంలో నటీనటులు.