‘వీర మహాదేవి’పై మండిపడుతున్న ఆందోళనకారులు

తెలుగు, కన్నడం సహా ఐదు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ‘వీర మహాదేవి’ సినిమాకు నిరసనల సెగ తగిలింది. ఈ సినిమా నుంచి శృంగార తార సన్నీ లియోన్‌ను తప్పించాలని కర్ణాటక రక్షణ వేదికె యువసేన బెంగళూరులో ధర్నాకు దిగింది. కాగా, ఈ సందర్భంగా కొందరు యువకులు వీర మహాదేవి సినిమా చిత్రీకరణను వ్యతిరేకిస్తూ చేతులను బ్లేడ్లతో కోసుకున్నారు. వీర మహాదేవిని అవమానించే రీతిలో సన్నీ లియోన్ కు సినిమాలో లీడ్ రోల్ ఇవ్వడంపై ఆందోళనకారులు మండిపడుతున్నారు.
సినిమా షూటింగ్ ను వెంటనే ఆపేయాలనీ, వాడి ఉదయన్‌ అందరికీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక రక్షణ వేదికె యువసేన డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సన్నిలియోన్ పోస్టర్లను తగులబెట్టి నిరసన తెలియజేశారు. మరోవైపు చిత్రదుర్గంలోనూ సన్నిలియోన్ ను వీరమహాదేవి సినిమాలో ప్రధాన పాత్ర ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అనంతరం జిల్లాధికారికి వినతిపత్రాన్ని సమర్పించారు
సన్నీలియోన్‌ ‘వీరమహాదేవి’… ఆమె అంటే వెర్రెత్తిపోయే అభిమానులను ఆమధ్య కేరళ లో చూసాం . ఆమె సినిమా మొదటి రోజే చూడాలనుకునే అభిమానుల కోకొల్లలు. ఇలాంటి వారికి భిన్నంగా కన్నడిగులు కనిపిస్తున్నారు. ఇంతకీ అసలు విషయమేమిటంటే….సన్నీ లియోన్‌ టైటిల్‌ రోల్‌లో స్టివ్‌ కార్నర్‌ పతాకంపై వీసీ వడివుడయాన్‌ దర్శకత్వంలో ఫోన్స్‌ స్టీవెన్‌ నిర్మిస్తున్న చిత్రం ‘వీరమహాదేవి’ . వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఐదు భాషల్లో ఒకేసారి షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు.ఇటీవల శాండిల్‌వుడ్‌లో సన్నీలియోన్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి, వందకోట్లతో తీయబోయే ఈ సినిమాకి సన్నీ కూడా పచ్చజెండా ఊపింది. అయితే సన్నీ ఈ సినిమాలో నటించడానికి కన్నడ సోదరులు ఒప్పుకోలేదు. కన్నడిగులు ఎంతో గౌరవించే వీర మహా దేవి పాత్రలో ఒక పోర్న్ స్టార్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని వారు తెగేసి చెప్పారు.దాంతో ఆ సినిమా వాయిదా పడిందట. ‘అసలు ఈ సినిమా ఆలోచన మానుకుంటే బెటరేమో’ అని ఆ దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట. అలా,  సన్నీ తొలిసారి చేస్తున్న పవర్ఫుల్ పాత్ర సినిమా అటకెక్కింది అంటున్నారు. ఈ పరిణామాలపై సన్ని తీవ్రంగా కలత చెందుతోందట. తనను నటిగా చూడాలే తప్ప పోర్న్‌ స్టార్‌గా చూడద్దొంటూ సినీ అభిమానులను కోరుతోంది.
నా శక్తిమేరకు ప్రయత్నిస్తా !
బాలీవుడ్‌లో ‘డర్టీపిక్చర్’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. దీంతో పాటు ఈ చిత్రం వివాదాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. అందాల తార విద్యాబాలన్ ఈ సినిమాలో మితిమీరి అందాలొలికించడమే కాకుండా అద్భుతమైన నటనతోనూ ఆకట్టుకుంది. ఇప్పుడు ‘డర్టీపిక్చర్’ వంటి సినిమా తనకు కూడా చేయాలని ఉందని అంటోంది హాట్ బ్యూటీ సన్నీలియాన్. కానీ ‘సన్నీ గ్లామరస్‌గా కనిపిస్తుందే కానీ విద్యాబాలన్ స్థాయిలో నటనా ప్రతిభను ప్రదర్శించలేదు కదా!’ అన్న మాటకు కూడా ఆమె బదులిచ్చింది. ‘నటన విషయంలో విద్యాబాలన్‌తో పోటీ పడలేను కానీ… నా శక్తిమేరకు ప్రయత్నించి చూస్తా’నని సన్నీలియాన్ అంటోంది. పోర్న్‌స్టార్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని బాలీవుడ్‌లోకి వచ్చిన సన్నీలియాన్ తన ఆలోచనల్ని చాలా వరకు మార్చేసుకుంది. డీ గ్లామర్ లుక్ కూడా ట్రై చేస్తానని ఈ భామ అంటోంది. గ్లామర్ మాత్రమే కాకుండా… నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తానని చెబుతోంది సన్నీలియాన్. డాన్సుల్లోనూ ప్రత్యేక శిక్షణ తీసుకొని, మంచి డాన్సర్ అనిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఏదో కొత్తగా ప్రయత్నం చేయాలని సన్నీలియాన్ ఆశ పడుతోంది.