సూపర్ స్టార్ చిత్రంలో సూపర్ స్టార్ !

‘స్పైడర్’ షూటింగ్‌‌లో పాల్గొంటూనే ‘భరత్ అను నేను’ సినిమా కొబ్బరి కాయ కొట్టేశాడు టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేశ్ బాబు. వరుస సినిమాలతో దూకుడు పెంచాడు .కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తను విన్న మహేశ్ అభిమానులు తెగ ఆనంద పడుతున్నారు…..కొరటాల శివ డైరెక్షన్‌లో ప్రస్తుతం మహేశ్ ‘భరత్ అను నేను’ సినిమా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను సంప్రదించాడట కొరటాల శివ. దానికి ఆయన కూడా ఓకే చెప్పేశారట.

దాదాపు 18 సంవత్సరాల తర్వాత కృష్ణ కొడుకు సినిమాలో నటించనుండడంతో ఈ సినిమా మహేశ్ కుటుంబానికి, వాళ్ల అభిమానులకు చాలా ప్రత్యేకమైనది అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటులు నటిస్తున్నారట.  కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నవిషయం తెలిసిందే..!కృష్ణ హీరోగా నటించిన కొన్ని సినిమాల్లో మహేశ్ బాల నటుడిగా నటించగా, మహేశ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలలో కృష్ణ అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. అయితే ఈసారి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లినట్టు కాకుండా సినిమాలో కీలకమైన ఓ పాత్రను ఆయన పోషించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని మహేశ్ కానీ, చిత్ర బృందం కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటించిన ‘స్పైడర్’ సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.