Tag: వై నాట్ స్టూడియోస్ (ఎస్.శశికాంత్)
ఇంతియాజ్ అలీతో ‘రిలయన్స్ ఎంటర్ టైన్‌మెంట్స్’
ప్రతిభ ఎక్కడున్నా చేతులు కలపడం రిలయన్స్ కు ఆది నుంచీ ఉన్న అలవాటు. తాజాగా అలాంటి గొప్పవిషయానికి ఇంకోసారి శుభారంభం పలికింది రిలయన్స్ సంస్థ. హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీలో దాదాపు 300లకి పైగా సినిమాలను నిర్మించి, పంపిణీ చేసి, విడుదల చేసిన ఘనత రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ది అనే విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ భారతదేశంగర్వించే సినిమా రూపకర్తల్లో ఒకరైన ఇంతియాజ్ అలీతో చేతులు కలిపింది.50:50 జాయింట్ వెంచర్‌గా ప్రతిష్టాత్మకంగా విండో సీట్ ఫిల్మ్స్, ఎల్ ఎల్ పిని మొదలుపెట్టింది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కుసంబంధించి ఐదో సృజనాత్మక భాగస్వామ్య ప్రొడక్షన్ కంపెనీ ఇది.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇదివరకే ఫాంటమ్ ఫిల్మ్స్ (అనురాగ్ కశ్యప్, మధు మంతెన, వికాస్ బాహల్, విక్రమాదిత్య మోత్వాని), రోహిత్ శెట్టి పిక్చర్జ్, ప్లాన్ సి స్టూడియోస్ (నీరజ్ పాండే), వై నాట్ స్టూడియోస్(ఎస్.శశికాంత్)తో సృజనాత్మక భాగస్వామ్యాలున్న విషయం విదితమే.
`సోచా నా` నుంచి మొన్న మొన్నటి `జబ్ వి మెట్`, `లవ్ ఆజ్ కల్`, `రాక్‌స్టార్`, `తమాషా`, `హైవే`,`జబ్ హ్యారీ మెట్ సెజల్` వంటి చిత్రాలతో ఇంతియాజ్ అలీ సినీ గోయర్స్ అందరికీ సుపరిచితులే.``ఈసృజనాత్మక, వ్యాపారాత్మక కలయిక వల్ల అటు ఇంతియాజ్‌లోని సృజన, ఇటు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్లోబల్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ కేపబిలిటీస్ కలిసి అత్యుత్తమ ప్రాజెక్ట్ లు రూపొందిస్తాయి`` అనివిండో సీట్ ఫిల్మ్స్, ఎల్ ఎల్‌పి, కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ ఛైర్మన్ అమితాబ్ జున్ జున్ వాలా మాట్లాడుతూ ``ఇంతియాజ్‌తో భాగస్వామ్యం కుదిరినందుకు ఆనందంగా ఉంది. నాణ్యత గల చిత్రాలను, ఆద్యంతం వినోదాత్మకమైన, అన్ని వర్గాల ప్రేక్షకులను రంజింపజేసే చిత్రాలను తీస్తామని తెలియజేస్తున్నాం`` అని చెప్పారు. ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ ``విండో సీట్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కి ఒకేరకమైనఆలోచనలున్నాయి. కంటెంట్ విషయంలో ఇద్దరి ఆలోచనలకు మధ్య సారూప్యత ఉంది. అందుకే ఇరువురం కలిసి ప్రేక్షకులను రంజింపజేయాలనుకుంటున్నాం`` అని అన్నారు. గతేడాది రిలయన్స్ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి వచ్చిన రోహిత్ శెట్టి `గోల్‌మాల్ 3` సూపర్‌డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఈ సంస్థ నుంచి సూపర్‌స్టార్స్ హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్ చిత్రాలున్నాయి.