Tag: directed by Venky Atluri
వరుణ్ తేజ్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి `తొలి ప్రేమ`
'మెగా ప్రిన్స్' వరుణ్ తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రానికి `తొలి ప్రేమ` అనే టైటిల్‌ను నిర్ణయించారు. రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. యువ దర్శకుడువెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాత. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా...నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ - ``ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి ఓ క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీని తెరకెక్కించారు.వరుణ్ తేజ్‌ను సరికొత్త క్యారెక్టర్‌లోప్రేక్షకులు చూడటం ఖాయం. `తొలిప్రేమ` అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే బ్యూటీఫుల్ లవ్ ఎంటర్‌టైనర్. ఈ డిసెంబర్ నెలలో షూటింగ్ పూర్తవుతుంది. జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలనపూర్తి చేస్తాం. ఫిబ్రవరి 9న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Mega Prince Varun Tej's Tholiprema Title Poster Released
Mega Prince Varun Tej’s new film under the popular production house of Sri Venkateswara Cine...