బాలీవుడ్ మూవీ లో సానియా మీర్జా

త్వరలో వెండితెర మీద  టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మెరవనుంది. టెన్నిస్ కోర్ట్ లోనే కాదు, ఫోటో షూట్ లోనూ అలరించే  ఈ బ్యూటీ, ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటన ల్లో ఆకట్టుకుంటోంది. అదే బాటలో వెండితెర మీద కూడా సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తోంద ని సానియా తెరంగేట్రంపై బాలీవుడ్ ఫిలిం మేకర్ ఫర్ఫాన్ అక్తర్ హింట్ ఇచ్చాడు….

ఈ ముప్పై ఏళ్ల అందాల హైదరాబాదీ భామ, తన తండ్రితో కలిసి ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందని తెలిపాడు. సానియా మీర్జా, ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జాల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండొచ్చని భావిస్తున్నారు. ఫాదర్స్ డే సందర్భంగా ఫర్ఫాన్ ఈ ప్రకటన చేశారు. ఫర్ఫాన్ ట్వీట్ పై స్పందించిన సానియా మీర్జా… కృతజ్ఞతలు తెలిపింది