బెట్టింగ్ బ్యాక్ డ్రాప్ లో బి.జి.వెంచర్స్ “గేమర్”

బి.జి.వెంచర్స్ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “గేమర్”. శ్రనిత్ రాజ్,  కల్యాణి, అనిరుధ్,నేహా, చిత్రం శీను ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు. ఫిలిం ఛాంబర్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో  జైన్, దిలిప్, గంగాధర్, నొవెల్ అగర్వాల్, జగదీష్  ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
దర్శక నిర్మాత రాజేష్ తడకల మాట్లాడుతూ… మా బి.జి.వేంచర్స్ పతాకంపై తెరకెక్కిన ఏడవ సినిమా ఇది. ప్రతి సారి కొత్త వారితోనె సినిమాలు చేస్తూ వస్తున్నాము. ఈ సినిమాతో శ్రనిత్ రాజ్,  కల్యాణి హీరో హీరోయిన్ లుగా పరిచయం చేస్తున్నాము. బెట్టింగ్ నేపధ్యంలో సాగే ధ్రిల్లర్ ఈ గేమర్ మూవీ.. లవ్, హార్రర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులను ఎంపిక చేసి ఈ సినిమాలో నటింపచేశాము..అన్నారు
హీరో శ్రనిత్ మాట్లాడుతూ.. గేమర్ లో నాది చాలెజింగ్ రోల్. ట్రెండింగ్ గా ఈ మూవీ ఉంటుందన్నారు.
అనిరుధ్ మాట్లాడుతూ…ఈ సినిమాలో నాది కామెడీ రోల్. దర్శక నిర్మాత రాజేష్ నటుడిగా   నన్ను ఎంకరేజ్ చేశారన్నారు. బి.జి యాక్టింగ్ అకాడమిలొ నటన నేర్చుకోవటానికి వస్తే తమకు హీరొయిన్ గా అవకాశం ఇచ్చారని నేహా, కల్యాణి తెలిపారు.