రోజా విడుదల చేసిన ‘తూనీగ’ సాంగ్ లిరిక‌ల్ వీడియో

వినీత్ చంద్ర‌, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న ‘తూనీగ’ చిత్రం సాంగ్ లిరిక‌ల్ వీడియోను ఏపీఐఐసీ ఛైర్మ‌న్, ప్రముఖ నటి రోజా సెల్వమణి లాంఛ్ చేశారు.ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా రూపొందించిన పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి చిత్ర బృందానికి అభినంద‌న‌లు తెలిపారు.చిత్ర ఘ‌న విజ‌యం సాధించాలని, కొత్త ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ మ‌రిన్ని వినూత్న క‌థా చిత్రాల‌ను రూపొందించాల‌ని కోరుకుంటూ ఆత్మీయ వ‌చ‌నం అందించారు.ఆయ‌నతో స‌హా అహ‌ర‌హం శ్ర‌మిస్తున్న బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.అనంత‌రం ఈ పాట‌ను ఆన్ లైన్ మాధ్య‌మాలలో మ్యాంగో మ్యూజిక్ శ్రోత‌ల‌కు అందుబాటులో ఉంచిం ది.హృద‌యం హృద‌యం క‌లిపిందీ క్ష‌ణం..అనే ప‌ల్ల‌వితో సాగే ఈ మొద‌టి పాట‌కు సంబంధించిన సాహిత్యాన్ని బాలాజీ అందించారు. హ‌రిగౌర ఈ పాట‌ను ఆల‌పించారు.క్ష‌ణం సినిమా ఫేం సిద్ధార్థ్ స‌దాశివుని స్వ‌రాలు స‌మ‌కూర్చారు.ఆద్యంతం హృద్య‌మైన సంగీతం, చ‌క్క‌ని భావాల‌తో సాగిపోయే ఈ పాట శ్రోత‌ల‌ను త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీమ్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా లిరిక‌ల్ వీడియోను లాంఛ్ చేసిన రోజా సెల్వ‌మ‌ణికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు చెల్లించారు.త‌నలాంటి ఔత్సాహిక సాంకేతిక నిపుణుల ను, చిత్ర రూప‌క‌ర్త‌ల‌ను ప్రోత్స‌హించడంలో తానెన్న‌డూ ముందుంటాన‌ని ఆమె చెప్ప‌డం త‌న‌కెంతో ఆనందాన్నిచ్చింద‌ని అన్నారు. అదేవిధంగా చిత్ర ప్ర‌చార సంరంభంలో భాగంగా త‌మ‌కు అండ‌గా నిలిచి, ఆత్మీయ అభినంద‌న అందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వేణు ఊడుగ‌లకు, స‌తీశ్ వేగేశ్న‌కు, ప్ర‌ముఖ క‌ళా ద‌ర్శ‌కులు ల‌క్ష్మ‌ణ్ ఏలేకు,అదేరీతిన డిజిట‌ల్ పోస్ట‌ర్ల‌ను అందంగా రూపొందించిన ప్ర ముఖ ఆర్టిస్టులు బాబు దుండ్ర‌పెల్లికి,గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లికి, ధ‌నుంజ‌య అండ్లూరికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.న‌ఖ చిత్రం రూపొందించి తూనీగ లోగోని అందంగా తీర్చిదిద్ది ఆన్ లైన్ మాధ్య‌మాల ద్వారా అందించిన రాజ‌మండ్రికి చెందిన విఖ్యాత న‌ఖ చిత్ర క‌ళాకారులు ర‌వి ప‌ర‌స‌కు సైతం తామెంతో రుణ‌ప‌డి ఉంటామ‌ని అన్నారు.

అదేరీతిన చిత్ర ప్ర‌చార సంరంభంలో అండ‌గా నిలిచిన ప్ర‌ముఖ జాన ప‌ద క‌ళాకారులు, రేలా రే రేలా ఫేం జాన‌కీ రాంకు,ఇంకా.. నెల రోజులుగా సాగుతున్న వ‌ర్థ‌మాన ర‌చ‌యిత ర‌త్న‌కిశోర్ శంభుమ హంతి నేతృత్వాన వినూత్న రీతిలో నిర్వ‌హిస్తున్న ప్ర‌చార పరంప‌ర‌లో భాగం పంచుకున్న ప్రచార‌, ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌తినిధుల కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.త్వ‌ర‌లోనే చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని, పూర్వ నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని కో ప్రొడ్యూస‌ర్ కె.ర‌మేశ్ తెలిపారు.లిరికల్ వీడియో విడుద‌ల సంద‌ర్భంగా చిత్ర బృందానికి శ్రీ‌కాకుళం ఫిల్మ్ క్ల‌బ్ నిర్వాహ‌కులు ర‌మేశ్ నారాయ‌ణ్‌, క‌ళింగ న‌గ‌రిలో ఈజిప్టు సుంద‌రి న‌వ‌లా ర‌చ‌యిత, శ్రీ‌కాకుళం యూత్ ఫోర్స్ గౌర‌వ అధ్య‌క్షులు భాను ప్ర‌కాశ్ కెంబూరి, వ‌ర్థ‌మాన గాయ‌ని ఆశా జీఆర్, శ్రీ‌కాకుళం ఫొటోగ్ర‌ఫ‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ మెట్ట నాగ‌రాజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ సామాజిక మాధ్య‌మాల ద్వారా స్పందించారు