ఆమె వేగం చూసి ఆందోళనపడుతున్నారు !

పదిహేనేళ్ళుగా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్‌గా రాణిస్తోంది త్రిష. ఈ మధ్యకాలంలో ఇంత సుదీర్ఘంగా సక్సెస్ ఫు‌ల్‌గా  కెరీర్ సాగించిన వాళ్ళు  లేరనే చెప్పాలి. ఆ మధ్య ప్రేమ పెళ్ళిచేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుందని అంతా అనుకుంటే అది కాస్త విఫలం కావడంతో, ఇప్పుడు రెచ్చిపోయి సినిమాలు చేసేస్తోంది త్రిష. తెలుగులో స్ట్రయిట్ మూవీస్  అమ్మడి ఖాతాలో లేకపోయినా తమిళంలో మాత్రం అవకాశాలు బాగా వస్తున్నాయి.కెరీర్ ముగింపునకు వచ్చిందని అంతా భావిస్తున్న సమయంలో ఈ  బ్యూటీ ఊహించని విధంగా ప్రత్యర్థులకు షాక్ఇస్తోందట. అమ్మడి వేగం చూసి ఆందోళనపడుతున్నారట తోటి హీరోయిన్లు.
 త్రిష కేవలం వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాదు. బ్రాండ్ అంబాసిడర్‌గానూ సత్తా చాటుతోంది. సహజంగా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నీ స్టార్స్ వెంట పడతాయి. వాళ్ళు అడిగినంత మొత్తం ముట్టచెప్పి పబ్లిసిటీకి ఉపయోగించుకుంటాయి. త్రిష కూడా ఆ విషయంలో తీసి పోలేదు. విశేషం ఏమంటే… ఇప్పటికీ త్రిష యాడ్స్ లో తనజోరు చూపిస్తోంది. తాజాగా ఓ చెప్పల్ బ్రాండ్‌కు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అమ్మడే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది.త్రిష ఇలా ఓ చెప్పల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం విశేషం ఏమీకాదు కానీ… దానిని కాజల్ నుండీ అంది పుచ్చుకోవడమే చర్చనీయాంశమైంది. ఇదే కంపెనీకి ఉత్తరాదిన అజయ్‌దేవ్‌గన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ఇప్పుడీ కంపెనీకి చెందిన  లేడీస్ వేర్‌ను ప్రచారం చేసే బాధ్యతను కంపెనీ త్రిషకు అప్పగించింది. మూడున్నర పదుల వయసులోనూ తన సత్తా తగ్గలేదని త్రిష ఈ రకంగా చెబుతోందని కోలీవుడ్ జనాలు అంటున్నారు.