పుకార్లను నమ్మొద్దు …అంతా హ్యాపీస్ !

 హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారన్న వార్తలు కలకలం రేపాయి. నిద్ర మాత్రలు మింగి ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వితికాను ఆస్పత్రికి తీసుకెళ్లి బ్రతికించుకున్నారని తెలుస్తోంది . అయితే ‘అవన్నీ పుకర్లే’నని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. వరుణ్ సందేశ్ భార్య వితిక ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే వితిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్తలు టాలీవుడ్‌లో కలకలం రేపాయి.
గత ఏడాది ఆగస్టులో వరుణ్-వితికల వివాహం జరిగింది. “పడ్డానండి ప్రేమలో మరి” అనే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పుడు ఇద్దరి మధ్యా చిగురించిన ప్రేమ కొన్నాళ్ల తర్వాత పెళ్లిగా మారింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు.అయితే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు వస్తున్న వార్తలను వితిక ఖండించారు…. ‘‘అవన్నీ ఫేక్. మేం సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దు’’ అని ఆమె ట్వీట్ చేశారు. ఈ పుకార్లపై మీడియాతో మాట్లాడతానని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే వరుణ్-వితికల మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవని వారి సన్నిహితులు చెబుతున్నారు. రెండు కుటుంబాల మధ్య కూడా గొడవలు లేవని ఇండస్ట్రీలో వరుణ్‌కు బాగా దగ్గరగా ఉన్న వారు చెబుతున్నారు. వరుస ప్లాపులతో సినిమాలకు విరామం ఇచ్చిన వరుణ్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.