అజిత్ `వివేకం` ఆగ‌స్ట్ 24న విడుద‌ల‌ !

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ హీరోయిన్స్‌.  ‘ర‌క్త‌చ‌రిత్ర’ చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరో అజిత్ అంటే ఇటు యూత్, మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ ఉంది. హీరో అజిత్ `వివేకం` చిత్రంతో మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించనున్నారు.  శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న`వివేగం` చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్‌ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్ర‌న్ సంగీత సారథ్యం వ‌హించిన ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుద‌లైంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ మాట్లాడుతూ – “అజిత్‌గారితో నేను చేసిన హ్యాట్రిక్ మూవీ ఇది. జేమ్స్ బాండ్ మూవీలా స్టైలిష్‌గా ఉంటుంది.  అలాగే అజిత్‌గారిని ఆయ‌న అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలాంటి మూవీ. అజిత్‌గారి లుక్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే విడుద‌లైన టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. సినిమాను ఆగ‌స్ట్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నాం. అనిరుధ్‌గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుంది“ అన్నారు.

చిత్ర నిర్మాత‌  న‌వీన్‌ మాట్లాడుతూ – “భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన అజిత్‌గారి వివేకం సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌డం ఎంతో సంతోషంగా ఉంది. చాలా స్టైలిష్ మూవీ. పాట‌లు మార్కెట్లోకి విడుద‌ల‌య్యాయి. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇటీవ‌ల తెలుగులో విడుద‌ల సినిమా టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ  సినిమాను ఆగ‌స్ట్ 24న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నాం. త‌ప్ప‌కుండా స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అంద‌రిన్నీ మెప్పించే చిత్రంగా మా బ్యాన‌ర్‌కు మంచి తెస్తుంది“ అన్నారు.

ఈ కార్యక్రమంలో త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, వెట్రి, మహేశ్వర్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.