26న వస్తున్న అక్షయ్ ‘హౌస్ ఫుల్ 4’ ప్రెస్ మీట్

అక్షయ్ కుమార్‌ ‘హౌస్ ఫుల్ 4’ ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌ నిర్మిస్తున్న ‘హౌస్ ఫుల్ 4’ కార్యక్రమానికి హీరో అక్షయ్ కుమార్‌తో పాటు హీరోయిన్లు కృతి సనన్, పూజా హెగ్డే, కృతి కర్బందా వచ్చారు .26న ఈ చిత్రం విడుదలవుతోంది. ఫర్హాద్ సంజీ ఈ చిత్రానికి దర్శకుడు.
అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. హౌజ్ ఫుల్ సిరీస్‌కు కంటిన్యూగా చేసిన ఈ చిత్రంలో కారెక్టర్స్ డిఫెరెంట్‌గా ఉంటాయి.హౌజ్ ఫుల్ 4 అనేది పూర్తిగా ఫన్ ఫిలిం.నాకు ఎప్పుడు హాలీడే కావాలనిపిస్తే అప్పుడు చేసే సినిమా హౌజ్ ఫుల్. ఈ సినిమా చేసినపుడు నేను చాలా రిలాక్స్ అవుతాను.. ఇందులో నా పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. ఇప్పుడు సినిమాలో కనిపిస్తున్న గెటప్ మేకప్ఒరిజినల్ కాదు. నా కెరీర్ 30 ఏళ్లలో కష్టపడిన మేకప్ ఒక్క రజినీకాంత్ ‘2.0’ సినిమాకే వేసుకున్నాను. మూడున్నర గంటలు వేసుకోడానికి.. గంటన్నర తీసేయడానికి పట్టేది. హౌజ్ ఫుల్ 4 మాత్రం త్వరగానే అయిపోయింది.. కచ్చితంగా ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుంది.. అని చెప్పారు.
 
పూజా హెగ్డే మాట్లాడుతూ.. ఇందులో నేను న్యూ ఏజ్ గాల్ పాత్రలో నటించాను. ఇందులో నేను రాజకుమారిగా.. మోడ్రన్ అమ్మాయిగా రెండు పాత్రలు చేసాను.మా ముగ్గురం అక్కాచెల్లెళ్లుగా నటించాము.. రాజకుమారిలం..మా ముగ్గురు ఆ ముగ్గురితో చేసే పూర్తిస్థాయి కామెడీ ఫిలిం ఇది.. అని చెప్పింది.
 
కృతి సనన్ మాట్లాడుతూ.. ఈ కారెక్టర్ చేయడం చాలా ఆనందంగా .. సరదాగా అనిపించింది. ఈ సినిమాలో మేము సిస్టర్స్. ముఖ్యంగా 1419 ప్రపంచం వేరు.. అప్పుడు ప్రపంచం ఎలా ఉండేదో మనకు తెలియదు.. అలాంటి చోట మనం కామెడీ చేయాలి.. డైలాగ్స్ కూడా నవ్వించడానికి చాలానే ఉన్నాయి.కామెడి క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి.. అక్షయ్ కుమార్తో పని చేయడం గౌరవంగా భావిస్తున్నాను.. అని చెప్పింది.
 
కృతి కర్బందా మాట్లాడుతూ.. ఈ సినిమాలో హైలైట్ కామెడీ. ముగ్గురు సిస్టర్స్ ముగ్గురు బాయ్స్‌తో కలిసి చేసే ఫన్ ఈ సినిమా. ప్రతీ ఒక్కరికి సినిమాలో నటించడానికి చాలా అవకాశం ఉంది.. మా పాత్రల్లో కావాల్సినంత కామెడీ ఉంది.. విజువల్ గ్రాండియర్‌గా కూడా హౌజ్ ఫుల్ 4 ఉండబోతుంది. కేవలం కామెడీ మాత్రమే కాకుండా సినిమాలో డ్రామా చాలా ఉంది… అని చెప్పింది