విప్లవ యోధుడు చేగువేరా బయోపిక్ ‘చే ‘ టీజర్ రిలీజ్

నవ ఉదయం సమర్పణలో నేచర్ ఆర్ట్స్ బ్యానర్ పై బి.ఆర్ సభావత్ నాయక్ “చే” టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా రూపోందుతున్న చిత్రం “చే” లాంగ్ లైవ్ ట్యాగ్ లైన్. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో  లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్ , పసల ఉమా మహేశ్వర్  కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే  చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా ఈమూవీ ఫస్ట్ లుక్ ను లాంచ్ చేసి చిత్రయూనిట్ ను అభినందించారు.. అక్టోబర్ 9 న క్యూబా పోరాటయోధుడు చేగువేరా వర్ధంతి  సందర్భంగా చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది.
బి.ఆర్ సభావత్ నాయక్ మాట్లాడుతూ… “విప్లవ వీరుడు , యువత స్పూర్తిదాయకుడు చేగువేరా జీవిత చరిత్రను సినిమా గా తీయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము.. ఆయన చేసిన పోరాటలు, త్యాగాలు  ఈ చిత్రంలో తీశాము. అప్పటి  పరిస్థితులకు అద్దం పట్టే విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుని, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ను రూపోందించాం” అని చెప్పారు. “ఈ మూవీ పోస్టర్ ను చేగువేరా కూతురు డా.అలైదా గువేరా విడుదల చెయ్యడం అదృష్టంగా భావిస్తున్నాం. ..ఆ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది…అక్టోబర్ 9 న విప్లయోధుడు చేగువేరా గారి వర్ధంతి సందర్భంగా టీజర్ రిలీజ్ చెయ్యడం గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్నారు.నవంబర్ లో మా చిత్రాన్ని  రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు..
నిర్మాతలు  : సూర్య , బాబు , దేవేంద్ర, రచయిత, దర్శకుడు : బి.ఆర్ సభావత్ నాయక్
బ్యానర్  : నేచర్ ఆర్ట్స్, D O P : కళ్యాణ్ సమి, జగదీష్, ఎడిటర్ : శివ శర్వాణి