చిరంజీవి-కొర‌టాల శివ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు

చిరంజీవి 152వ చిత్రం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ రామ్‌చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌లుగా ప్రారంభ‌మైంది.
`ఖైదీ నంబ‌ర్ 150`, `సైరా న‌ర‌సింహారెడ్డి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాత చిరంజీవి హీరోగా.. డిఫ‌రెంట్ చిత్రాలతో వ‌రుస విజయాలను ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు దసరా రోజు హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.
శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తుండ‌గా.. తిరు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సురేష్ సెల్వ‌రాజ‌న్‌