దండమూడి బాక్సాఫీస్ సాయి స్ర‌వంతి మూవీస్ ‘కథ వెనుక కథ’

సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్స్‌ ప్రొడక్ష‌న్.. విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైత‌న్య దర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్ లుక్‌ విడుద‌ల చేశారు.

నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ… ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఎంతో కష్టపడ్డాడు. అలీ, సుమన్ ఇలా అందరూ చక్కగా నటించారు. పాటలు అద్భుతంగా వచ్చాయి’’ అని అన్నారు.

సునీల్ మాట్లాడుతూ… ‘‘కథ వెనుక కథ’లో చాలా కథలుంటాయి. స్క్రీన్ ప్లే బాగుంటుంది. నాకు మంచి పవర్ ఫుల్ పాత్ర దొరికింది. సినిమా వల్ల వందల కుటుంబాలు బాగుంటాయి. సినిమా హిట్ అయితే వేల కుటుంబాలు బాగుపడుతాయి’’ అని అన్నారు.

కమెడియన్ అలీ మాట్లాడుతూ…  ‘‘దండమూడి అవనింద్ర కుమార్ గారిది గోల్డెన్ హ్యాండ్‌. ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. డబ్బుల కోసం ఆలోచించకుండా సినిమాలు తీస్తూనే ఉంటాను అని చెబుతున్నారు. గొట్టిపాటి సాయి గారిని నిర్మాతగా చేశారు. అనుకున్న బడ్జెట్‌లో అద్భుతంగా సినిమాను నిర్మించారు. కథ వెనుక కథ మంచి కథ. డైరెక్టర్ చైతన్య కృష్ణకు ఈ కథ బాగా నచ్చింది’’ అని అన్నారు.

ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ…  ‘‘దండమూడి గారు వంద సినిమాలు తీయగల సత్తా ఉన్న వ్యక్తి. ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న సాయి గారి జడ్జ్మెంట్ బాగుంటుంది’’ అని అన్నారు.

హీరో దుద్దుంపూడి విశ్వంత్ మాట్లాడుతూ…  ‘‘ అందరి జీవితాల్లో ఎన్నో కథలుంటాయి. మా నిర్మాత వెనుకున్న కథ ఎందరికో స్పూర్తిగా ఉంటుంది. మా డైరెక్టర్ కృష్ణ చైతన్యతో నాకు ఎన్నో ఏళ్ల పరిచయం ఉంది. మా కెమెరామెన్ శేఖర్‌ అద్భుతంగా విజువల్స్ అందించారు. ఆలీ, సునీల్, రఘుబాబు వంటి వారితో నటించడం ఆనందంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి గారితోనే ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాతో గట్టిగా కొట్టబోతోన్నాం’’ అని అన్నారు.

మురళీ మోహన్ మాట్లాడుతూ…  ‘‘దండమూడి అవనింద్ర గారితో నాకు దాదాపు 35 ఏళ్ల పరిచయం ఉంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేసి రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయుర్వేద వైద్యులు కూడా. కరోనా సయమంలోనూ అందరికీ మందులు పంచారు. కథ వెనుక కథ టైటిల్ బాగుంది. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పేరు బాగుంది. సినిమా విజయం అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ…  ‘‘మా దండ‌మూడి బ్యాన‌ర్ అధినేత అవ‌నింద్ర కుమార్‌గారు చాలా మంచి వ్య‌క్తి. ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌నే ఉద్దేశంతో క‌రోనా స‌మ‌యంలో ఆయ‌నే ఓ మందు క‌నిపెట్టారు. దాన్ని నేనే తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ డిపార్ట్‌మెంట్ స‌హా అంద‌రికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అవ‌నింద్ర కుమార్‌గారు సినిమా రంగంలోకి రావాల‌నుకుంటే ఏరోజు వ‌చ్చి ఉండేవారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్‌, నాగార్జున‌ల‌తో కూడా ఆయ‌న సినిమాలు చేస్తారు. ప్యాష‌న్‌తో సినిమా చేయాల‌నే ఉద్దేశంతోనే ఈ క‌థ వెనుక క‌థ సినిమాను చేశాం. దీనిపై వ‌రుస సినిమాలు చేస్తాం. ఇప్ప‌టికే ప్రొడ‌క్ష‌న్ నెం.2 స్టార్ట్ చేశాం.  మూడో సినిమాకు కూడా సిద్ధం అవుతున్నాం. హీరో విశ్వంత్ పాత్ర‌లో జీవించాడు. సునీల్ పాత్ర సినిమాకు ప్రాణం. మూవీ కొత్త‌గా ఉంటుంది. అన్ని పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉంటాయి. మీ ముందుకు మ‌రిన్ని మంచి చిత్రాల‌తో వ‌స్తామ‌ని తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు.

చిత్ర దర్శకుడు కృష్ణ చైత‌న్య మాట్లాడుతూ…  ‘‘కథ వెనుక కథ’ సినిమాను ఇంత లార్జ్ స్కేల్‌లో చేశామంటే ముందుగా అవ‌నింద్ర కుమార్‌గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అలాగే సాయిగారు చేసిన స‌పోర్ట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వారి వ‌ల్ల మా సినిమా రేంజ్ పెరిగింది. ఈ దండ‌మూడి బాక్సాఫీస్ సంస్థ పేరు భ‌విష్య‌త్తులో ఇంకా బ‌లంగా వినిపిస్తుంది. నా జ‌ర్నీలో స‌పోర్ట్‌గా నిలిచిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

విశ్వంత్ దుద్దుం పూడి, శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య‌ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘుబాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్ ఈరోజుల్లో సాయి, రూప తదిత‌రులు ఈ చిత్రంలో న‌టీన‌టులు.  సినిమాటోగ్ర‌ఫీ: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, ఈశ్వ‌ర్‌, మ్యూజిక్‌:  శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్‌, ఎడిటింగ్: అమ‌ర్ రెడ్డి కుడుముల‌, లిరిక్స్‌: కాస‌ర్ల శ్యామ్‌, పూర్ణా చారి .