కె. రాఘవేంద్రరావు విడుదల చేసిన ‘దేశముదుర్స్’ మోషన్ పోస్టర్

M K ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బేనర్ లో  కన్మణి దర్శకత్వం లో , కుమార్ నిర్మించిన “ దేశముదుర్స్ “ చిత్రం మోషన్ పోస్టర్ ని దర్శకేంద్రుడు కె . రాఘవేంద్రరావు విడుదల చేసారు .
ఈ సందర్బంగా రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ… మోషన్ పోస్టర్ చాలా ఇమ్ ప్రసివ్ గా ఉంది , పోసాని , పృథ్వి కాంబినేషన్ లో రూపొందిన ఈ కామెడీ కాంబో తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది చెపుతూ  చిత్ర  యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు .
నిర్మాత కుమార్ మాట్లాడుతూ…మా దేశముదుర్స్ చిత్రం వినోదాల విందుగా , జనాలని ఆకట్టుకుంటుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు .
దర్శకుడు కన్మణి మాట్లాడుతూ…మంచి కధతో , వినోదమే ప్రదానంగా , ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది . దర్శకేంద్రుడు కె .రాఘవేంద్ర రావు గారు  ఈ దేశముదుర్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరించడం   ఆనందంగా ఉంది అని అన్నారు .
ఈ కార్యక్రమంలో  దర్శకుడు కన్మణి, నిర్మాత కుమార్ తో పాటుగా అర్జున్ , గౌతం రాజు , భవాని ప్రసాద్ , అడుసుమిల్లి విజయ్ కుమార్ ,యాజమాన్య , రాంబాబు గోసాల పాల్గొన్నారు .
పోసాని కృష్ణ మురళీ, పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాలో అర్జున్ , గాయత్రీ , ఆలీ , శకలక శంకర్ , అశ్విని ….తదితరులు నటించారు .